
AP Elections Political Latest Updates Telugu..
9:05PM, Feb 24th, 2024
టీడీపీ-జనసేనకు అభ్యర్థులే దొరకడం లేదు: జోగి రమేష్
- పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు
- మా టార్గెట్ 175కు 175 సీట్లు గెలవడమే
- మళ్లీ వైఎస్ జగనే సీఎంగా కొనసాగడం ఖాయం
8:50PM, Feb 24th, 2024
తూర్పుగోదావరి జిల్లా:
చంద్రబాబుకి ఇదే ఆఖరి ఎలక్షన్: ఎంపీ కేశినేని నాని
- ఎన్నికల ఫలితాలు రాగానే సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్ళిపోతాడు
- జనసేన నాయకులు కార్యకర్తలపై జాలేస్తుంది
- జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆయన చంద్రబాబుకు ప్రాణమిచ్చేందుకు సిద్ధపడుతున్నాడు
- రాజానగరంలో జక్కంపూడి రాజాను కచ్చితంగా గెలిపించుకోవాలి
8: 40PM, Feb 24th, 2024
విజయవాడ:
వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడంపై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం
- చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగా అభిమానులు
- వంగవీటి రంగాను పొట్టపెట్టుకున్న చంద్రబాబు ... వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారు
- వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా మరోమారు రంగాను పొట్టన పెట్టుకున్నాడు
- రంగా కుటుంబానికి మరోమారు ద్రోహం చేశారు
- బోండా లాగా కబ్జాలు రౌడీయిజాలు రాధా చేయలేరు
- ప్రజల రక్తాన్ని పీల్చి ముడుపులు తెచ్చి ఇవ్వలేరు
- కాబట్టే కాపు ముద్దుబిడ్డ రంగా వారసుడుని పక్కనపెట్టి నీచరాజకీయాలకు తెరలేపారు
- రంగా ఆత్మక్షోభకు గురయ్యేలా చేశారు
- చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహి
8: 20PM, Feb 24th, 2024
చిత్తూరు:
ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ముందుంది: మంత్రి పెద్దిరెడ్డి
- టీడీపీ, జనసేలు అభ్యర్థులను వెతుకుతున్నాయి
- ఇవాళ ప్రకటించిన లిస్ట్ చూస్తే ఆ కూటమికి అభ్యర్థులు కరువైనట్లు కనిపిస్తోంది
- మరోసారి వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
7:40PM, Feb 24th, 2024
- మనం ఆయన్ని నమ్మాము... కానీ ఆయన మనల్ని నమ్మలేదు
- పవన్ కళ్యాణ్ పై కొత్తపేట జనసేన ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ వ్యాఖ్యలు
- టిక్కెట్టు దక్కకపోవడంపై నిర్వేదం.
6:50 PM, Feb 24th, 2024
మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోటలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
- శంకర్కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గయుల ఆగ్రహం
- ఫ్లెక్సీలు చింపివేసి నిరసన
6:45 PM, Feb 24th, 2024
ఏపీలో రోడ్డెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు
- టికెట్ రాకపోవడంతో పలుచోట్ల నిరసనలు
- పి.గన్నవరం టికెట్ మహాసేన రాజేష్‌కు కేటాయించిన టీడీపీ!
- మహాసేన రాజేష్‌కు ఇవ్వడంపై తమ్ముళ్ల ఆగ్రహం
- పార్టీకి రాజీనామా చేసిన పి.గన్నవరం మండల అధ్యక్షుడు సత్తిబాబు
6:44 PM, Feb 24th, 2024
నెల్లూరు: వచ్చే నెల 3న మేదరమెట్లలో సిద్ధం సభ: విజయసాయి రెడ్డి
- తిరుపతి, నెల్లూరు, ఒంగోలు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో చర్చించాం
- మేదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారు
- 2024 నుంచి 2029 వరకు ఏమి చేయబోతున్నారో జగన్ వివరిస్తారు
- ప్రభుత్వం అందించిన పథకాలను సభలో సీఎం జగన్ వివరిస్తారు
6:43 PM, Feb 24th, 2024
జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ సూర్యచంద్ర భావోద్వేగం
- టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో ఆమరణదీక్ష
- అచ్యుతాపురం దుర్గాదేవి గుడి ఎదుట దీక్షకు సిద్ధమైన సూర్య
- ఆమరణ దీక్షతో ప్రాణాలు పోయినా లెక్కచేయను
- రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్లు అసెంబ్లీకి వెళ్లకూడదా?
- సామాన్యులు టికెట్ కోరుకోవడమే తప్పా? : సూర్యచంద్ర
6:41 PM, Feb 24th, 2024
ఉత్తరాంధ్రలో జనసేనకు ఇచ్చిన 2 స్థానాల్లో టీడీపీ అసంతృప్తులు
- నెల్లిమర్ల, అనకాపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ల అసంతృప్తి
- అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కర్రోతు బంగార్రాజు
- అనకాపల్లి టికెట్ పీలా గోవింద్ కే ఇవ్వాలని అనుచరుల డిమాండ్
6:40 PM, Feb 24th, 2024
ఏలూరు: టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివ
- సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ టికెట్ ఇవ్వడంతో అలక
- ఉండి నుంచే పోటీ చేస్తానని తన క్యాడర్‌కు కలువపూడి శివ భరోసా
- 2009, 2014లో ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కలువపూడి శివ
- అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న కలువపూడి శివ
6:20PM, Feb 24th, 2024
పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది: పేర్ని నాని
- ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు
- చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడు
- 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా?
- పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామేత గుర్తొస్తుంది
- పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో
- పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు
- పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో
- పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు నే డిసైడ్ చేస్తారు
- జనసేన , టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట
- చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు
- కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు
- చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు
- బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే
- భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు
- కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు
- ఈ జాబితా తో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది
5:53PM, Feb 24th, 2024
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీలో రచ్చరచ్చ
- తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు మొండిచెయ్యి
- టీడీపీ ఫ్లెక్సీలను చింపేసిన శంకర్ యాదవ్ వర్గం
5:50PM, Feb 24th, 2024
టీడీపీ-జనసేన శ్రేణుల్లో విభేదాలు, అసమ్మతి సెగలు
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండిచెయ్యి
- చింతలపూడి నాన్‌లోకల్‌కు టికెట్ కేటాయింపుతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు
- ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం
- తణుకులో పవన్ మాట ఇచ్చినా.. రామచంద్రరావుకు దక్కని సీటు
- తాడేపల్లిగూడెం, నర్సాపురం స్థానాల్లో టీడీపీ-జనసేనల మధ్య కుదరని సయోధ్య
- ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్ప నాయుడికి ఆశాభంగం
5:05PM, Feb 24th, 2024
పవన్ కనీసం తన సీటును ప్రకటించుకోలేదు:మంత్రి అంబటి
- ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారు
- పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది
- అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచారు
- పల్లకీ మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు చేసుకో
- చంద్రబాబును కాపాడేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చారు
- చంద్రబాబు, పవన్ ఓడిపోతారని వాళ్ల ఫేస్ చూస్తే తెలుస్తుంది
- పవన్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియన అధ్వాన్న స్థితి
- చంద్రబాబు పల్లకి మోసే దశకు పవన్ చేరుకున్నారు
- ప్యాకేజీ రాజకీయాల్లో పవన్ బలికావొద్దు
5:02PM, Feb 24th, 2024
కృష్ణాజిల్లా:
మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి
- అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్
- ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బుద్ధప్రసాద్
- అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం
- ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని ఆశపడ్డ బుద్ధ ప్రసాద్
- పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును పెండింగ్ లో పెట్టిన చంద్రబాబు , పవన్
- నాపేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను
- పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉంది
- నేను పదవుల కోసం పుట్టలేదు
- రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి
- డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది
- ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబు పై పరోక్ష విమర్శలు చేసిన బుద్ధప్రసాద్
5:00PM, Feb 24th, 2024
విజయనగరం:
కళా వెంకట్రావ్ వర్గానికి ఆశాభంగం
- కిమిడి కళా వెంకట్రావ్, కిమిడి నాగార్జునకు దక్కని చోటు
- కళా వెంకట్రావ్ వ్యతిరేకించిన కొండ్రు మురళీమోహన్‌కు రాజాం టికెట్
4:56PM, Feb 24th, 2024
విశాఖ జిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం
- విశాఖ వెస్ట్ టీడీపీ టికెట్ గణబాబుకు కేటాయించడంపై పాసర్ల అసంతృప్తి
- టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కార్యదర్శి పాసర్ల ప్రసాద్ రాజీనామా
- తొలి నుంచి గణబాబుకు టికెట్‌ను వ్యతిరేకిస్తున్న పాసర్ల ప్రసాద్
- పార్టీకి నిస్వార్థంగా సేవ చేసినా గుర్తింపు దక్కలేదని పాసర్ల ఆవేదన
4:50PM, Feb 24th, 2024
ప్యాకేజీ స్టార్ సీటుపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు: మంత్రి అమర్నాథ్
- 24 సీట్లు తీసుకున్న పవన్ ఎలా సీఎం అవుతాడు?
- అది ప్యాకేజీ ఇంజినీరింగ్..!
- సామాజిక న్యాయాన్ని పట్టించుకోని టిడిపి, జనసేన
- కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు?
- మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే
4:10PM, Feb 24th, 2024
టీడీపీ, జనసేన పార్టీల డొల్లతనం బయటపడింది: ధర్మశ్రీ
- నియోజకవర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి
- పవన్ పార్టీని జనసేన అనాలో, భజన సేన అనాలో అర్థమైంది
- పవన్.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
- పార్టీకి జెండా.. అజెండా ఉండాలి
- కాపులకి ఏ విధంగా న్యాయం చేశావో చెప్పాలి
- టీడీపీకి నీ భాషలో పొత్తు.. కానీ జనం భాషలో తొత్తుగా తయారయ్యావు
పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే సినిమాలు చేసుకో: మంత్రి అంబటి
పల్లకి మోసి పరువు
తీసుకోవడం కంటే
విలీనం చేసి సినిమాలు
తీసుకోవడం మంచిది
..... మన అన్నగారిలా!!
పల్లకి మోసి పరువు
— Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024
తీసుకోవడం కంటే
విలీనం చేసి సినిమాలు
తీసుకోవడం మంచిది
..... మన అన్నగారిలా!!@PawanKalyan
పల్లకి మోయడానికి తప్ప
పావలా వంతుకు కూడా
పనికిరావని తేల్చేసారు.... ఛీ
పల్లకి మోయడానికి తప్ప
— Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024
పావలా వంతుకు కూడా
పనికిరావని తేల్చేసారు.... ఛీ @PawanKalyan
3:56 PM, Feb 24th, 2024
తికమక పొత్తులు - వెన్నుపోటు కత్తులు! 😂#TDPJSPCollapse#EndOfTDP pic.twitter.com/msvjk4bJrQ
— YSR Congress Party (@YSRCParty) February 24, 2024
3:30 PM, Feb 24th, 2024
బంటుమిల్లి పర్యటనలో వేదవ్యాస్‌కు అస్వస్థత
- కృష్ణా : చినపాండ్రాక PHCలో వేదవ్యాస్‌కు ప్రాథమిక చికిత్స
- పెడన టికెట్ కృష్ణప్రసాద్‌కు కేటాయించడం పై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ అసంతృప్తి
- 2024లో పెడన సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు
- ఏం జరిగిందో తెలియదు కానీ లిస్ట్ లో నా పేరు లేదు
- కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తా
3:16 PM, Feb 24th, 2024
తిరుపతి:
కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు పవన్ తాకట్టు పెట్టారు: మంత్రి ఆర్‌కే రోజా
- పవన్.. రాజకీయాలకు పనికిరారు
- 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు పవన్ తాకట్టు పెట్టారు
- పవన్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
- ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికిపోయారు
- ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు
- రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు
2:50 PM, Feb 24th, 2024
కాకినాడ:
టీడీపీ-జనసేనలో టికెట్ల అసమ్మతి
- జగ్గంపేట సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో నైరాశ్యం
- టీడీపీ టికెట్ జ్యోతుల నెహ్రూకు కేటాయింపుపై జనసేనలో అసంతృప్తి
- పవన్ తీరుపై తీవ్ర మనస్తాపం చెందిన జనసేన ఇన్‌చార్జ్ సూర్యచంద్ర
- ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పని బోరున విలపించిన పాఠంశెట్టి
2:40 PM, Feb 24th, 2024
టీడీపీలో అసంతృప్తి సెగలు
- రాయచోటిలో రమేష్ రెడ్డికి మొండిచేయి
- రామ్ ప్రసాద్ రెడ్డికి రాయచోటి టికెట్ ప్రకటన
- తనను సంప్రదించకుండా టికెట్ ప్రకటించారని రమేష్ రెడ్డి ఆగ్రహం
- చంద్రబాబుది అనాలోచిత నిర్ణయంత్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా
2:30 PM, Feb 24th, 2024
బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు
- తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత
- 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే
- మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు
- బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే
- చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్న ఇతర వర్గాలు
2:20 PM, Feb 24th, 2024
అనంతపురం : కల్యాణదుర్గం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
- కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు టికెట్ కేటాయించిన చంద్రబాబు
- చంద్రబాబు తీరుపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆగ్రహం
- చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసిన ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం
2:10 PM, Feb 24th, 2024
గజపతి నగరం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
- పార్టీ కార్యాలయంలో అనుచరులతో అప్పలనాయుడు అత్యవసర భేటీ
- పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు
- కొండపల్లి అప్పలనాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై క్యాడర్ అసంతృప్తి
- కష్టకాలంలో పార్టీ జెండాను మోసినవారిని ఎందుకు కాదన్నారంటూ ఆగ్రహం
2:00 PM, Feb 24th, 2024
24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్: సజ్జల
- పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది
- అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారు
- చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు
- ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు
- పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు
- జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు
- టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు
- తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదు
- జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారు
- పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలి
- 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరు
- పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుంది
- 24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా?
- 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారు
- రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు
- ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదు
- వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే ఘన విజయం
1:10 PM, Feb 24th, 2024
కర్నూలు టీడీపీలో ముసలం..
- ఆలూరు టీడీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.
- ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మకు సైడ్ ఇస్తున్న చంద్రబాబు..
- మాజీలు వీరభద్రగౌడ్, శివప్రసాద్ పేర్లు టికెట్ కోసం పరిశీలన.
- దీంతో, టీడీపీలో ముసలం.
- ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తిరుగుబాటు తప్పదంటున్న టీడీపీ నేతలు.
కర్నూలు జిల్లా ఆలూరులో @JaiTDP లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి..!
— YSR Congress Party (@YSRCParty) February 24, 2024
ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మని పక్కనపెట్టి.. మాజీలు వీరభద్రగౌడ్, శివప్రసాద్ పేర్లని టికెట్ పరిశీలన కోసం @ncbn తీసుకోవడంతో ముసలం మొదలైంది.
ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో తిరుగుబాటు…
1:00 PM, Feb 24th, 2024
తొలి జాబితా ఎఫెక్ట్.. టీడీపీకి షాక్!
- రాయచోటిలో చంద్రబాబుపై తిరుగుబాటు..
- మూకుమ్మడి రాజీనామాలకు రెడీ అయిన టీడీపీ నేతలు
- ఇంఛార్జ్ రమేష్‌రెడ్డి హ్యాండిచ్చిన చంద్రబాబు.
- టీడీపీని వీడిన 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పీఎంపీ, 20 మంది ఐటీడీపీ సభ్యులు,
మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి తదితరులు. - డబ్బు కోసం టీడీపీ టికెట్ అమ్ముకోవడానికి నిరసనగా రాజీనామాలు.
రాయచోటిలో బాబుపై తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలు..!
— YSR Congress Party (@YSRCParty) February 24, 2024
నియోజకవర్గ ఇంఛార్జ్ రమేశ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పీఎంపీ, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి తదితరులు పార్టీని వీడారు.…
12:45 PM, Feb 24th, 2024
ఒంటరిగా పోటీకి దమ్ములేని చంద్రబాబు..
- తొలి జాబితాలో టీడీపీకి 94 స్థానాలు,
- జనసేకు 24 స్థానాలు,
- బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు
- బీజేపీ కోసం 57 స్థానాలను రిజర్వ్ చేసిన బాబు, పవన్
- బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు రెడీ అయిన చంద్రబాబు.
బీజేపీ కోసం వెంపర్లాడుతున్న @ncbn ఇప్పటికే @JaiTDP కి కొన్ని సీట్లు కేటాయించి, @JanaSenaParty కి కొన్ని సీట్లు ముష్టి వేసి, బీజేపీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకుని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచాడు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే దమ్ములేని…
— YSR Congress Party (@YSRCParty) February 24, 2024
12:15 PM, Feb 24th, 2024
టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు వీరే..
- ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
- టెక్కలి-అచ్చెన్నాయుడు
- ఆమదాలవలస-కూన రవికుమార్
- రాజాం-కోండ్రు మురళి
- కురుపాం - తొయ్యక జగదీశ్వరి
- పార్వతీపురం - విజయ్ బోనెల
- సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
- బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)
- గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్
- విజయనగరం - అదితి గజపతిరాజు
- విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణబాబు
- విశాఖ వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు
- అరకు - సియ్యారి దొన్ను దొర
- పాయకరావుపేట - వంగలపూడి అనిత
- నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
- తుని-యనమల దివ్య
- పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
- అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
- ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
- పి.గన్నవరం - రాజేశ్ కుమార్
- కొత్తపేట - బండారు సత్యానంద రావు
- మండపేట - జోగేశ్వరరావు
- రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
- జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
- ఆచంట - పితాని సత్యనారాయణ
- పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
- ఉండి - మంతెన రామరాజు
- తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
- ఏలూరు - బాదెటి రాధాకృష్ణ
- చింతలపూడి - సోంగ రోషన్
- తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్
- నూజివీడు - కొలుసు పార్థసారథి
- గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
- గుడివాడ - వెనిగండ్ల రాము
- పెడన - కాగిత కృష్ణ ప్రసాద్
- మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
- పామర్రు - వర్ల కుమార రాజ
- విజయవాడ సెంట్రల్ - బొండ ఉమ
- విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన రావు
- నందిగామ - తంగిరాల సౌమ్య
- జగ్గయ్యపేట - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
- తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్
- మంగళగిరి - నారా లోకేశ్
- పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర
- వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్‌బాబు
- రేపల్లె - అనగాని సత్యప్రసాద్
- బాపట్ల - వి.నరేంద్ర వర్మ
- ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజినేయులు
- చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
- సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ
- వినుకొండ - జీవీ ఆంజనేయులు
- మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి
- యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్ బాబు
- పర్చూరు - ఏలూరి సాంబశివరావు
- అద్దంకి - గొట్టిపాటి రవికుమార్
- సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్
- ఒంగోలు - దామచర్ల జనార్దనరావు
- కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి
- కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
- కావలి - కావ్య కృష్ణారెడ్డి
- నెల్లూరు సిటీ - పి. నారాయణ
- నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్‌కుమార్
- సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవేల విజయశ్రీ
- ఉదయగిరి - కాకర్ల సురేశ్
- కడప - మాధవిరెడ్డి
- రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
- మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
- ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ
- శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
- కర్నూలు - టీజీ భరత్
- పాణ్యం - గౌరు చరితా రెడ్డి
- నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్
- బనగానపల్లి - బీసీ జనార్దనరెడ్డి
- డోన్ - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
- పత్తికొండ - కేఈ శ్యాంబాబు
- కోడుమూరు - బొగ్గుల దస్తగిరి
- రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
- ఉరవకొండ - కేశవ్
- తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి
- శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ
- కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు
- రాప్తాడు - పరిటాల సునీత
- మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్‌కుమార్
- హిందూపురం - నందమూరి బాలకృష్ణ
- పెనుకొండ - సవిత
- తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
- పీలేరు - నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి
- నగరి - గాలి భానుప్రకాశ్
- గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్ వీఎం. థామస్
- చిత్తూరు - గురజాల జగన్మోహన్
- పలమనేరు - ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి
- కుప్పం - నారా చంద్రబాబు నాయుడు
ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు వీరే
- కాకినాడ రూరల్.. నానాజీ,
- నెల్లిమర్ల.. లోకం మాధవి
- తెనాలి.. నాదెండ్ల మనోహర్
- అనకాపల్లి.. కొణతాల రామకృష్ణ.
- రాజానగరం.. రామకృష్ణుడు
11:25AM, Feb 24th, 2024
ఏపీలో పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్
- పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
- టీడీపీ, జనసేన పొత్తులో ఉండి సీట్ల సర్ధుబాటు చేసుకుంటున్నారు.
- బీజేపీతో పొత్తులో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు
- ఆ విషయం అధిష్టానం చూసుకుంటుంది.
- అప్పటివరకు క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తాం
11:10AM, Feb 24th, 2024
చంద్రబాబుతో పవన్, మనోహర్ భేటీ
- టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై కసరత్తు
- చంద్రబాబుతో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ
- కాసేపట్లో అభ్యర్థుల ప్రకటన
10:54AM, Feb 24th, 2024
బీజేపీతో టీడీపీ-జనసేన దొంగాట..
- ఒకవైపు బీజేపీతో చర్చలు అంటూనే మరోవైపు టీడీపీ-జనసేన సీట్ల ప్రకటన
- ఈనెల 21, 22న బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు-పవన్ చర్చలని లీకులు
- పొత్తుల డ్రామా ఆడి చివరికి ఏకపక్షంగా సీట్లు ప్రకటిస్తున్న టీడీపీ-జనసేన
- బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడవడం కొత్తేమీ కాదంటున్న పరిశీలకులు
- ఇలా అయితే ఇక పొత్తు లేనట్లే అంటున్న బీజేపీ నేతలు
10:43 AM, Feb 24th, 2024
బాబు ఇంటికి జనసేనాని
- చంద్రబాబు నివాసానికి బయల్దేరిన పవన్ కల్యాణ్
- కాసేపట్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
- తొలి జాబితాను ప్రకటించనున్న బాబు-పవన్
- టీడీపీ-జనసేనకు 50-10 లేదంటే 60-10గా ఉండే అవకాశం
10:15 AM, Feb 24th, 2024
ఏం చేద్దాం తమ్ముళ్లూ?
- కాసేపట్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా
- అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- 11 గంటలకు అభ్యర్థులు ఇరువురు నేతల సంయుక్త ప్రకటన
- టీడీపీ నుండి 50, జనసేన నుండి 10 సీట్లు ప్రకటించే అవకాశం
- కాసేపటి కిందట.. ఉండవల్లిలోని తన నివాసంలో కీలక నేతలతో చంద్రబాబు భేటీ
- హాజరైన అచ్చెన్న, యనమల తదితర సీనియర్లు
- జాబితాపై నేతలతో బాబు చర్చలు
- పలు నియోజకవర్గాల కోసం ఇరు పార్టీల నడుమ తీవ్ర పోటీ
- టికెట్ దక్కనివాళ్లు త్యాగాలు చేస్తారా? తిరగబడతారా? .. నెలకొన్న ఆసక్తి
ఇదీ చదవండి: టీడీపీ-జనసేనలో మిగిలేదెవరో?
10:05 AM, Feb 24th, 2024
ఎల్లో మీడియా చెత్త రాతలు..
- జర్నలిజం విలువలు వదిలేసిన ఎల్లో మీడియా
- చంద్రబాబుకు అధికారం కోసం పిచ్చి రాతలు..
- ప్రభుత్వంపై బురద చల్లి వికృతానందం.
- టిష్యూ పేపర్‌లా మారిన ఆంధ్రజ్యోతి.
9:45 AM, Feb 24th, 2024
చంద్రబాబు సొంతింట్లో కుంపటి..
- కుప్పం నుంచి బైబై అంటున్న చంద్రబాబు
- పోటీకి రెడీ అంటున్న భువనేశ్వరి
చంద్రబాబు సొంతింట్లో కుంపటి..! #WhyNotKuppam#ByeByeBabu#WhyNot175#EndOfTDP pic.twitter.com/dKCTquryle
— YSR Congress Party (@YSRCParty) February 23, 2024
9:15 AM, Feb 24th, 2024
అజ్ఞాతంలోకి టీడీపీ ఇన్‌ఛార్జ్ కిమిడి
- రెండు రోజులుగా అజ్ఞాతంలోకి చీపురుపల్లి టీడీపీ ఇన్‌చార్జ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున.
- చీపురుపల్లి నుండి గంటా శ్రీనివాసరావును పోటీ చేయమని ఆదేశించిన టీడీపీ అధిష్టానం.
- అధిష్టానం తీరుతో పార్టీకి దూరంగా కిమిడి నాగార్జున.
- చంద్రబాబు ఫోన్‌కు స్పందించని నాగార్జున.
- గంటాకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దం అవుతున్న చీపురుపల్లి కేడర్
8:40AM, Feb 24th, 2024
పెద్దాపురంలో టీడీపీలో కొత్త ట్విస్ట్..
- పెద్దాపురంలో టడీపీ సీటు విషయంలో కొత్త ట్విస్ట్
- చిన రాజప్పకు కంట్లో నలుసుగా మారిన లోకేష్ అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి.
- సీటు కోసం విశ్వప్రయ్నాలు చేస్తున్న చంద్రమౌళి
- ఇటీవల కారణంగా నియోజకవర్గంలో తన కుమారుడు రంగనాథ్‌ను పార్టీ కార్యక్రమాలకు తిప్పిన రాజప్ప
- టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో రాజప్పకు 52%, నోటాకు 48% ఓటింగ్.
- దీంతో పెద్దాపురంలో మరోసారి ఇంటర్నల్ సర్వే చేపట్టిన టీడీపీ.
- పెద్దాపురం సీటు నాదే అంటున్న చినరాజప్ప.
- నేడు ప్రకటించే జాబితపై రాజప్ప ఉంటుందా? అనే అంశంపై ఆసక్తికర చర్చ.
8:15AM, Feb 24th, 2024
బొబ్బిలి టికెట్‌పై సస్పెన్స్..
- బొబ్బిలి టీడీపీ టికెట్‌పై తర్జన భర్జన.
- టికెట్ ఆశిస్తున్న బేబీనాయనకు ఆశాభంగం అని జోరుగా ప్రచారం.
- తెరపైకి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు పేరు.
- బేబీనాయన శిబిరంలో తీవ్ర అసంతృప్తి.
7:45AM, Feb 24th, 2024
నేడు టీడీపీ-జనసేన జాబితా విడుదల!
- పొత్తుల్లో భాగంగా నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాబితా విడుదల
- 60-70 నుంచి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- జాబితా విడుదల నేపథ్యంలో టీడీపీ నేతల్లో టెన్షన్
- టికెట్ రాకపోతే చంద్రబాబుపై యుద్ధానికి రెడీ అంటున్న పచ్చ నేతలు
- కొందరికి సీటు ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలు చోట్ల ఉద్రిక్తతలు
7:25AM, Feb 24th, 2024
టీడీపీలో ముసలం.. పారాచూట్ నేతల హవా..
- ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో దిగిపోయిన బయట వ్యక్తులు
- ధన బలం, ఇతర హంగులుండడంతో వారికే చంద్రబాబు ప్రాధాన్యం
- మొదటినుంచి ఉన్నవారిని పక్కన పెట్టడంతో వారిలో తీవ్ర అసంతృప్తి
- గుడివాడలో వెనిగళ్ళ రాము రాకతో మొదటి నుంచి ఉన్న ‘రావి’కి చెక్
- గుంటూరులో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ కోసం పార్టీ నేతలకు ఝలక్
- పార్వతీపురంలో చిరంజీవులును పక్కనపెట్టి ఎన్‌ఆర్‌ఐకి పెద్దపీట
- అన్ని జిల్లాల్లోనూ పారాచూటర్లతో స్థానిక నేతలకు ఇబ్బందులు
7:15AM, Feb 24th, 2024
మార్చి 3న సిద్ధం సభ
- వైఎస్సార్‌సీపీ సిద్ధం నాలుగో సభ ఖరారు.
- మార్చి మూడో తేదీన బాపట్ల జిల్లా అద్ధంకిలోని మేదరమెట్లలో సిద్ధం సభ
- సిద్ధం సభ ఏర్పాట్లు చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి.
- భీమిలీ, ఏలూరు, రాప్తాడు సభలకు పోటెత్తిన ప్రజలు
- నాలుగో సభకు కూడా రికార్డు స్థాయిలో హాజరుకానున్న జనం.
7:00AM, Feb 24th, 2024
చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.... ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి.
- సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు
- పొలాల్లో రాజధాని ఎలా కడతాం
- రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప
- మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్ కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి
- మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి
- 33 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు... పిట్టల దొర కబుర్లు చెబుతున్నాడు
- ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థనుక్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా...?
- రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా...?
- దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా....?
- ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు
- 25 లక్షల జనాభా.... పోర్టు.... అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే.... మహానగరంగా అయ్యి తీరుతుంది
- వైజాగ్‌ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే..... వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు
- ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు
- సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు ...120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు
- కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం
- నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్‌కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు
- జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్
- రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో A టు Z తెలిసిన వ్యక్తి సీఎం జగన్
6:50AM, Feb 24th, 2024
కాకినాడలో టీడీపీ, జనసేన రచ్చకెక్కిన విభేదాలు
- తమకు చెప్పకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం పై టీడీపీ ఫైర్
- సీటు ప్రకటించకుండా కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు
- చంద్రబాబు, టీడీపీకి జనసేన ఊపిరి పోసిందని ఓ అసామి మాట్లాడారు
- అలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం చేతగాని వాళ్లలా చూస్తూ ఊరుకోవాలా?
- జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా?
- కాకినాడ రూరల్ సీటును టీడీపీ ఎప్పటి నుంచో బీసీలకు కేటాయిస్తోంది
6:30AM, Feb 24th, 2024
కాకినాడ రూరల్‌లో టీడీపీ వర్సెస్ జనసేన
- జనసేన తీరును తప్పుపట్టిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ
- నిన్న కాకినాడ రూరల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన
- టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడం పై టీడీపీ అభ్యంతరరం
- జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటన
- ఆ ప్రకటన పై సారీ చెబుతూనే జనసేన తీరును తప్పుపట్టిన పిల్లి సత్యనారాయణ
- తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటున్న పిల్లి వర్గం
- తమ కుటుంబం పై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయన్న పిల్లి సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment