March 22nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024: News, Political Round Up On March 22nd Updates | Sakshi
Sakshi News home page

March 22nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Fri, Mar 22 2024 6:54 AM | Last Updated on Fri, Mar 22 2024 9:00 PM

AP Elections 2024: News, Political Round Up On March 22nd Updates - Sakshi

AP Elections & Political March 21st Latest News Telugu

8:56PM, March 22nd, 2024

పశ్చిమగోదావరి జిల్లా: 

భీమవరం పట్టణంలో జనసేనకు షాక్

  • భీమవరం పట్టణం 1వ వార్డు జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌
  • వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
     

8:50PM, March 22nd, 2024

ఎన్టీఆర్ జిల్లా: 

మైలవరం టీడీపీలో దేవినేని ఉమా తిరుగుబావుటా 

  • టిక్కెట్ దక్కపోవడంతో తీవ్ర అసహనంలో దేవినేని ఉమా 
  • చంద్రబాబు నమ్మించి మోసం చేయడంతో కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కిన ఉమా 
  • కార్యకర్తలతో కలిసి మౌనంగా ర్యాలీ చేపట్టి తన నిరసన తెలిపిన ఉమా 
  • వసంత కృష్ణప్రసాద్ వద్దు .. ఉమా ముద్దు అంటూ కార్యకర్తల నినాదాలు 
  • వసంతకు సహకరంచేది లేదని తేల్చి చెప్పిన ఉమా వర్గం 
  • మైలవరం టిక్కెట్ దేవినేని ఉమాకే ఇవ్వాలని డిమాండ్

6:27 PM, March 22nd, 2024

విజయవాడ:

పిఠాపురంలో ఎదురీదుతున్న పవన్

  • బరిలోకి దిగకుండానే ఓటమి భయంలో పవన్ కళ్యాణ్
  • మిత్రపక్షాల‌నుంచి కరువైన సహకారం
  • పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు
  • పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన
  • మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో అయోమయంలో టీడీపీ, జనసేన క్యాడర్
  • పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే
  • పిఠాపురంలో గెలుపుకోసం పవన్ నానా తంటాలు
  • వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయం
  • పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు

6:25 PM, March 22nd, 2024

విశాఖ:

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.

  • మహిళలకు మందు తాగించి చంద్రబాబుపై కేకే రాజు దాడి చేయించారన్న విష్ణుకుమార్ రాజు
  • విష్ణుకుమార్ రాజుపై మండిపడుతున్న మహిళలు
  • మహిళలు మందు తాగే వారిగా కనిపిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు

6:23 PM, March 22nd, 2024

విజయవాడ

బరిలోకి దిగకుండానే ఓటమి భయంలో పవన్ కళ్యాణ్

  • పిఠాపురంలో ఎదురీదుతున్న పవన్
  • మిత్రపక్షాల‌నుంచి కరువైన సహకారం
  • పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు
  • పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన
  • మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో అయోమయంలో టీడీపీ, జనసేన క్యాడర్
  • పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే
  • పిఠాపురంలో గెలుపుకోసం పవన్ నానా తంటాలు
  • వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయం
  • పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు

5:27 PM, March 22nd, 2024

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

కోనసీమ జిల్లాలో టీడీపీ-జనసేన పార్టీల్లో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు 

  • రామచంద్రపురంలో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించినా ఊరుకోని జనసేన నాయకులు
  • జనసేన ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బొలిశెట్టి చంద్రశేఖర్
  • పి గన్నవరంలో తేలని కూటమి అభ్యర్థి... బీజేపీకి ఇచ్చేందుకు  సిద్ధమవుతున్న నేతలు
  • ఈ స్థానం బీజేపీకి ఇస్తే కలసిరామంటున్న జనసేన-టీడీపీ నేతలు
  • రాజోలు జనసేనలో కొనసాగుతున్న రగడ
  • జనసేన ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావును కాదని మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ సీటు ప్రకటించిన జనసేన
  • ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటున్న బొంతు వర్గం

5:04 PM, March 22nd, 2024

కృష్ణాజిల్లా: 

గన్నవరంలో కడప టీడీపీ ఇంచార్జి మాధవి హల్ చల్

  • కారులో వెళ్తూ  వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఫోటోతీసిన మాధవి 
  • ఫోటో ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరుష పదజాలంతో దూషించిన మాధవి 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
  • కారు రోడ్డు మీదే ఆపేసి టీడీపీ కార్యకర్తలను పిలిపించిన మాధవి 
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు

4:28 PM, March 22nd, 2024

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేనల మధ్య గందరగోళ పరిస్థితులు

  • టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి , సీట్ల ప్రకటనతో మింగుడు పడని ఇరు పార్టీల కేడర్
  • పొత్తుల పేరుతో కత్తులు నూరుకుంటున్న ఇరు పార్టీల నేతలు
  • జిల్లాలో రగులుతున్న అసంతృప్తి సెగలు
  • నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌కు సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు
  • తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ అలకబూనిన కొత్తపల్లి సుబ్బారాయుడు
  • భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు
  • ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యతఇస్తున్నారంటూ.. జనసేన నేతల్లో వర్గ పోరు
  • తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో నైరస్యంలో ఉన్న విడివాడ రామచంద్రరావు..
  • తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనని శపథం పూనిన విడివాడ
  • దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
  • పోలవరం సీటుపై తేలని పంచాయతీ... టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్,లేదా జనసేన నుండి  బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమన్న కేడర్
  • ఇతరుల పేరుతో కొనసాగుతున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు

4:24 PM, March 22nd, 2024

తిరుపతి జిల్లా:

తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు వ్యతిరేకిస్తున్న టీడీపీ, జన సేనలో ఒక వర్గం

  • లోకల్ ముద్దు - నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్న వైనం 
  • నాగబాబు వద్దకు చేరిన తిరుపతి పంచాయితీ
  • జనసేన కు కేటాయించిన సీటుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ, 
  • టికెట్ ఇస్తే జనసేన నుంచి సిద్దం అంటున్న సుగుణమ్మ
  • శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు
  • సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోనేటి ఆది మూలం వద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు
  • టీడీపీ రెబెల్ గా బరిలో దిగిన సత్యవేడు మాజీ ఇంచార్జ్‌ జీడి రాజశేఖర్
  • మదనపల్లి నియోజక వర్గం లో షాజహాన్ బాషాను వ్యతిరేకిస్తున్న దొమ్మల పాటి రమేష్,  జన సేన పార్టీ నేత రామ్ దాస్ చౌదరి
  • తంబల్లపల్లెలో జయచంద్రరెడ్డికి కేటాయించడంతో  మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాయాదవ్ వర్గం ఆగ్రహం
     

4:06 PM, March 22nd, 2024

సీట్లు కేటాయింపుపై కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ-జనసేన మధ్య అసమ్మతి పోరు

  • జగ్గంపేట సీటు జ్యోతుల నెహ్రూకు ప్రకటించడంతో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన జనసేన ఇంచార్జ్‌ పాఠంశెట్టి సూర్య చంద్ర
  • నెహ్రూ ను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన సూర్యచంద్ర
  • పిఠాపురంలో పవన్ తప్పా...వేరొకరు పోటీ చేస్తే పల్లకి మోసేది లేదని చెబుతున్న టీడీపీ ఇంచార్జ్‌ ఎస్ విఎస్ఎన్వర్మ
  • పవన్ లోక్ సభకు వెళ్తే టీడీపీ నుండి పిఠాపురంలో పోటికి సిద్దమని ప్రకటన
  • తంగెళ్ళతో ఉన్న  తీవ్ర విభేధాలతో రగిలిపోతున్న వర్మ
  • కాకినాడ సిటీ సీటు వనమాడి కొండబాబుకు ప్రకటించడంతో జనసేన ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ శిభిరంలో నెలకొన్న నైరాశ్యం
  • కాకినాడ సీటుపై‌ ముత్తా పెట్టుకున్న ఆశలు గల్లంతు

3:54 PM, March 22nd, 2024

శ్రీకాకుళం: 

చంద్రబాబు తీరుపై శ్రీకాకుళం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం

  • బాబు ప్రకటించిన మూడో జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి
  • మూడవ జాబితాలోని కనిపించని గుండ లక్ష్మీదేవి పేరు
  • బాబు తీరుపై శ్రీకాకుళంలోని గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆందోళన
  • చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పార్టీ జెండాలు, మేనిఫెస్టో కాల్చి నిరసన తెలిపిన కార్యకర్తలు
  • డబ్బు కోసం శ్రీకాకుళం సీటును చంద్రబాబు అమ్ముకున్నాడు అంటూ నిరసన
  • మరోవైపు పాతపట్నంలో కలమట వెంకటరమణ అనుచరులు ఆందోళన
  • టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని చంద్రబాబు మోసం చేశాడని ఆవేదన
  • మామిడి గోవిందరావుకు సీటు ప్రకటించడాన్ని తప్పుపట్టిన టీడీపీ కార్యకర్తలు
  • వెంటనే మార్చి సీటు కలవట వెంకటరమణకు ఇవ్వాలని డిమాండ్
  • లేనిపక్షంలో టీడీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించిన నాయకులు
  • 3వ జాబితాలో ప్రకటించని మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు
  • కళా వెంకట్రావుకు ఎచ్చర్లలో వెంటనే సీటు ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్
  • తీవ్ర నిరాశలో ఉన్న కళా వెంకట్రావు వర్గం
  • టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు అభిమానులు
  • చంద్రబాబు తీరు తమకు చాలా తమకు బాధ కలిగిస్తుందన్న టీడీపీ నాయకులు 
  • ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించాలని డిమాండ్

3:52 PM, March 22nd, 2024

చీపురుపల్లి టికెట్‌పై టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ

  • టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున
  • గంటా శ్రీనివాస్‌కు చీపురుపల్లి టికెట్ ఇస్తామన్న చంద్రబాబు. 
  • ఆందోళనలో కిమిడి నాగార్జున కేడర్
  • గంటాకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని హెచ్చరిక

3:50 PM, March 22nd, 2024

విజయనగరం జిల్లా:

విజయనగరం జిల్లా టీడీపీలో ఆరని అసమ్మతి జ్వాలలు

  • గజపతినగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్‌కు ఇవ్వడం పట్ల భగ్గుమన్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు వర్గం.
  • పార్టీ పదవులుకు  మూకుమ్మడి రాజీనామాలు
  • నెల్లిమర్ల టికెట్ జనసేన అభ్యర్ది లోకం మాధవికి కేటాయించడంపై మండిపడ్డ టీడీపీ ఇంచార్జ్‌ కర్రోతు బంగార్రాజు వర్గం
  • చంద్రబాబు తీరుకు నిరసనగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ప్రకటించిన బంగార్రాజు సోదరుడు కర్రోతు సత్యనారాయణ.

3:40 PM, March 22nd, 2024

ఏపీ సచివాలయం: 

చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు: పేర్ని నాని

  • విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది
  • 25 వేల కిలోల మత్తు పదార్థాలని సీబీఐ పట్టుకుంది
  • ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు
  • సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు
  • విదేశాలనుంది డ్రగ్స్ అందుకున్నో లు అంత చంద్రబాబు , కుటుంబ సభ్యుల చుట్టలే
  • చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు
  • చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే
  • చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది
  • దీనిలో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరాం
  • గతంలో 5 ఏళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు
  • ఆ సింగపుర్‌ మంత్రి జైల్లో ఉన్నాడు
  • చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది
  • చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు
  • ఆ భయంతో నే దీనిపై విచారణ చెయ్యాలి
  • ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీ ని కోరాం
  • దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు
  • చంద్రబాబు ట్వీట్ పై కూడా ఫిర్యాదు చేసాము
  • అది ఎన్నికల నియమావలికి విరుద్ధం
  • తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి
  • చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు
  • ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు
  • దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం
  • దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు
  • ఈనాడు పత్రికలో విషంతో వార్తలు రాశారు
  • ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం

3:15 PM, March 22nd, 2024

ఏపీ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

  • ముఖేష్ కుమార్ మీనాతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి సమావేశం
  • వైజాగ్ డ్రగ్ రాకెట్ లో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు
  • ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదు

2:55 PM, March 22nd, 2024
టీడీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న టిక్కెట్ల దోబూచులాట

  • నాలుగు ఎంపీ స్ధానాలు పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు
  • బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్
  • రాజమండ్రి లేదా ఒంగోలు,రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్
  • ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు
  • రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నాలు
  • వెంకయ్యనాయుడు పీఏగా సుధీర్ఘకాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్
  • బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్
  • కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల‌ పోటీచేస్తారనే ప్రచారం
  • షర్మిల కోసం కడప స్ధానాన్ని పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు

2:25 PM, March 22nd, 2024
కూటమిలో ఇంకా క్లారిటీకి రాని స్థానాలివే..

  • కూటమిలో ఇంకా క్లారిటీ లేని 20 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలు
  • అనంత, కృష్ణా జిల్లాల్లో మూడేసి స్థానాలు పెండింగ్ 
  • శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో రెండేసి స్థానాలు పెండింగ్ 
  • విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం పెండింగ్ 
  • బీజేపీ ఖాతాలోకి పి.గన్నవరం? 
  • తిరుపతి అభ్యర్థి మార్పుపై జనసేనలో తర్జన భర్జన 
  • కొన్ని స్థానాలను మార్చుకుంటామని అడుగుతోన్న జనసేన
  • మారుతున్న సమీకరణాల మేరకు అవకాశం ఇవ్వాలంటోన్న జనసేన
  • ఏ సర్వే చూసినా.. ఏమున్నదన్నట్టుగా జనసేన పరిస్థితి
  • తెలుగు బీజేపీ నేతలతో తలకిందులైన ఏపీ బీజేపీ పరిస్థితి
  • బీజేపీని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్నవారికి మొండిచేయి అని ప్రచారం
  • బాబు ప్రయోజనాల కోసం కీలక స్థానాలు వదులుకున్నారని విమర్శలు

2:10 PM, March 22nd, 2024
చంద్రబాబు పాలనలో నీరే లేదు: మంత్రి పెద్దిరెడ్డి

  • ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ 
  • 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు చంద్రబాబు
  • సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు
  • గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారు 
  • కరోనా కష్టకాలంలో ఎంతో కష్టపడి  పని చేసిన వాలంటీర్లు పట్ల చులకనగా చంద్రబాబు మట్లాతున్నారు. 
  • సీఎం జగన్ పాలనలో బ్యాంకులు, అధికారులు స్వాగతిస్తున్నారు. 
  • దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేశాం
  • ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చిన ఏకైక సీఎం జగన్‌. 
  •  విద్యార్దులకు ఎంతో ప్రయోజనం చేస్తున్నారు
  • పేదల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చంద్రబాబు పాలనలో ఏనాడు ఆలోచన చేయలేదు
  • చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా గుర్తుకు రాదు
  • ఆరణియార్ ప్రాజెక్ట్ ఈరోజు సీఎం జగన్ పాలనలో జల కలతో ఉంది
  • చంద్రబాబు పాలనలో నీరే లేదు
  • సీఎం జగన్‌ రెండే ఓట్లు అడుగుతున్నారు.
  • ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా రాజేష్‌ను గెలిపించుకోవాలని కోరుతున్నాను. 

1:45 PM, March 22nd, 2024
విశాఖ డ్రగ్స్ కేసు నిందితులతో టీడీపీ నేతలకు సంబంధాలు: సజ్జల

  • పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయి
  • దీనివెనుక చంద్రబాబు, ఆయన వదిన, మరికొందరు గ్యాంగ్ ఉన్నారు
  • ఇది ఖచ్చితంగా టీడీపీ నాయకుల పనే అని గట్టిగా అనుమానిస్తున్నాం
  • పురంధేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఉన్నట్టు మాకు అనుమానం
  • తప్పించుకోవడానికే మా మీద నిందలు వేస్తున్నట్టు ఉంది
  • లక్కీగా పట్టుకున్నాం కాబట్టి దేశానికి, రాష్ట్రానికి పెద్ద రిలీఫ్
  • వీళ్ల అరుపులు చూస్తూంటే వీళ్లే చేసినట్టు అనిపిస్తోంది
  • దాని వెనుక ఎవరున్నారని చూస్తే వాళ్లకు సంబంధాలు ఉన్నాయి
  • దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ తీరు ఉంది
  • టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు 
  • విశాఖలో భారీగా డ్రగ్స్ ను సీబీఐ పట్టుకుంది 
  • చంద్రబాబు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు 
  • తప్పు చేసి రివర్స్ లో మా మీదే ఆరోపణలు చేస్తున్నారు 
  • తప్పించుకోవాడానికే టీడీపీ నేతలు మా మీద నిందలు వేస్తున్నారు 
  • తప్పు చేసి కావాలనే మా మీద నిందలు వేస్తున్నారు
  • తప్పుడు ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది 
  • డ్రగ్స్ నిందితులకు, టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి

1:25 PM, March 22nd, 2024
టీడీపీలో కొనసాగుతున్న నిరసనలు..

  • శ్రీకాకుళం సీటు ఆశించిన గుండ లక్ష్మీదేవి
  • గొండు శంకర్‌కు టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం 
  • పార్టీ జెండాలు కాల్చి లక్ష్మీదేవి అనుచరుల నిరసన 
  • టీడీపీ మూడో జాబితాలో టికెట్ ఇవ్వకపోవడంతో గుండ లక్ష్మీదేవి అనుచరుల ఆగ్రహం

1:00 PM, March 22nd, 2024
గత్యంతరం లేక బోడేకు సీటిచ్చారు: మంత్రి జోగి రమేష్ సెటైర్లు

  • పెనమలూరు టీడీపీ సీటు బోడె ప్రసాద్ కు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు
  • కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి  రమేష్
  • చంద్రబాబు పెనమలూరులో అనేక సర్వేలు చేయించాడు: జోగి  రమేష్
  • పెనమలూరులో నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు: జోగి  రమేష్
  • గత్యంతరం లేక చివరికి బోడెకి సీటు ఇచ్చాడు: జోగి  రమేష్
  • పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం: జోగి  రమేష్
  • కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు.: జోగి  రమేష్
  • రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు.: జోగి  రమేష్
  • పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక ఇది : జోగి  రమేష్
  • 175 స్థానాలు కైవసం చేసుకుంటాం: జోగి  రమేష్

12:45 PM, March 22nd, 2024
విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర పరిణామాలు

  • విజయవాడ పార్లమెంట్ ఫైట్‌లో కేశినేని బ్రదర్స్ 
  • వైఎస్సార్‌సీపీ తరఫున కేశినేని నాని, టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ 
  • పెనమలూరు టికెట్ పోరాడి దక్కించుకున్న బోడె ప్రసాద్ 
  • తనకు టికెట్ రాదనే ప్రచారంతో ఇటీవల బోడె ప్రసాద్ నిరసనలు 
  • టీడీపీ మూడో లిస్టులో మూడు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు 
  • విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు ఖరారు 
  • పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో బోడె ప్రసాద్ 
  • మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 
  • మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను పక్కనపెట్టిన టీడీపీ 
  • ఇటీవలే వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్

12:30 PM, March 22nd, 2024
ఏలూరు టీడీపీ, బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తి సెగలు

  • నాన్ లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో రేగిన చిచ్చు 
  • చంద్రబాబుపై చింతలపూడి టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
  • పొత్తులో భాగంగా సీటు ఆశించి భంగపడ్డ గారపాటి చౌదరి 
  • రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని గారపాటికి కేడర్ సూచన

12:10 PM, March 22nd, 2024
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి టీడీపీ ఎంపీ టికెట్

  • బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ 
  • అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కృష్ణప్రసాద్ 
  • తాజాగా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన కృష్ణప్రసాద్ 
  • చివరికి ఏపీ బాపట్ల లోక్‌సభ బరిలో మాజీ డీజీపీ

11:45 AM, March 22nd, 2024
మాజీమంత్రి ఆలపాటి ఆగ్రహం

  • టికెట్ రాకపోవడంతో మాజీమంత్రి ఆలపాటి ఆగ్రహం
  • టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ 
  • సాయంత్రం నాలుగు గంటలకు తెనాలిలో కార్యకర్తలతో ఆలపాటి సమావేశం 
  • రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశం

11: 20 AM, March 22nd, 2024
విశాఖ డ్రగ్స్ కేసులో పట్టుబడింది టీడీపీ నేతల అనుచరులే: ఎంపీ భరత్

  • విశాఖ డ్రగ్స్ మాఫియా చాలా రోజులుగా సాగుతోంది.
  • ఎన్నికల కోడ్ వచ్చినా హిందూపురంలో బాలకృష్ణ చీరలు పంచుతున్నారు.
  • రూ.5 వేల గౌరవ వేతనం తీసుకునే పిల్లలపై మీ ప్రతాపం చూపిస్తారా?. 

11:00 AM, March 22nd, 2024
బీసీలకు, కాపులకు చంద్రబాబు వెన్నుపోటు..

  • టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా లీక్
  • మీడియాకు లీక్ ఇచ్చిన టీడీపీ వర్గాలు
  • అధికారికంగా ట్వీట్ చేయని చంద్రబాబు, టీడీపీ
  • బీసీలకు, కాపులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
  • 13 స్థానాల్లో కేవలం 4 స్థానాలే బీసీలకు ఇచ్చిన చంద్రబాబు
  • 11 ఎంపీ స్థానాలను బీసీలకు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్
  • బీసీ జనాభా అత్యధికంగా ఉన్న సీట్లు అగ్రవర్ణాలకే ఇచ్చిన టీడీపీ
  • విశాఖ, నర్సరావుపేట, గుంటూరు అన్ని కమ్మ సామాజికవర్గానికే ఇచ్చిన చంద్రబాబు
  • కడప నుండి తెచ్చి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్‌ని పెట్టిన చంద్రబాబు
  • 13 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వని చంద్రబాబు
  • పక్క పార్టీల నుండి వచ్చిన వారికే అధిక ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు
  • మరో నాలుగు సీట్లు పెండింగ్‌లో టీడీపీ

10:35 AM, March 22nd, 2024
టీడీపీ మూడో జాబితా విడుదల..

  • టీడీపీ మూడో జాబితా విడుదలైంది.
  • 11 మంది అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.
  • పలాస-గౌతు శిరీష,
  • మైలవరం- వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌
  • అమలాపురం- ఆనందరావు
  • పాతపట్నం- మామిడి గోవింద రావు. 
  • శ్రీకాకుళం- గొండు శంకర్‌
  • చీరాల- మాల కొండయ్య.
  • పాతపట్నం- మామిడి గోవిందరావు. 
  • శృంగవరపుకోట- కోళ్ల లలితా కుమారి. 
  • పెనమలూరు- బోడే ప్రసాద్‌

లోక్‌సభ..

  • విజయవాడ లోక్‌సభ- కేశినేని చిన్ని
  • హిందుపూర్‌- కే. పార్థసారథి. 
  • విశాఖ-భరత్‌.
  • గుంటూరు-చంద్రశేఖర్‌
  • చిత్తూరు-ప్రసాదరావు
     

10:20 AM, March 22nd, 2024
టీడీపీ కూటమిపై విజయసాయి సెటైర్లు..

  • తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మాజీ వైఎస్సార్‌సీపీ నేతలే
  • వైఎస్సార్‌సీపీ టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్‌లోని నాయకులను ఎందుకు ప్రోత్సహించడం లేదు?
  • అలా సొంత నాయకత్వాన్ని ప్రోత్సాహించటానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి?
  • వారు తమ కార్యకర్తలను ఎందుకు నమ్మటంలేదు?
  • వచ్చే ఎన్నికలు వైఎస్సార్‌సీపీ, ఫిరాయింపుదారుల మధ్య పోటీలాగా కనిపిస్తోంది. 

10:00 AM, March 22nd, 2024
నేడు టీడీపీ మూడో జాబితా?

  • నేడు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం
  • బీజేపీ, జనసేనతో సీట్ల ఖరారుపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు
  • 17 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉన్న టీడీపీ
     

09:30 AM, March 22nd, 2024
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. 

  • గోపాలపురం టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.
  • మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసనలు
  • మద్దిపాటి వద్దు.. ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్ళపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళనలు
  • ఇన్‌ఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్.
  • మద్దిపాటికి టికెట్ కేటాయించిన అధిష్టానం.
  • మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో ఓడిస్తామంటున్న అసమ్మతి వర్గీయులు
     

09:00 AM, March 22nd, 2024
టీడీపీలో విభేదాలు.. 

  • శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు
  • బొజ్జల సుధీర్‌కు షాక్ ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
  • ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పేరుని ఏకపక్షంగా ప్రకటించారని మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు

08:00 AM, March 22nd, 2024
సీఎం జగన్‌ బిజీ బీజీ

  • పార్టీ నేతలతో బిజీగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • ఒకవైపు పార్టీ నేతలతో సమీక్షలు, మరోవైపు బస్సుయాత్రకు సన్నాహాలు
  • నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశం
  • జిల్లాలోని పరిస్థితులపై చర్చలు
  • ప్రత్యర్థి పార్టీల నేతల బలాబలాలపై ఆరా
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారాలపై సమీక్షలు
  • ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా ఎదుర్కొనాలనే దానిపై దిశానిర్దేశం

07:45 AM, March 22nd, 2024
జనసేన నాయకులతో నాగబాబు భేటీ.. 

  • తిరుపతి జనసేన నాయకులతో  నాగబాబు సమావేశం
  • తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కలిసి పనిచేసేది లేదంటున్న జనసేన నాయకులు
  • జనసేనలో ఆరణి శ్రీనివాసులుకు మరో వర్గం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత
  • తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్‌తో పాటు 25మందితో నిన్న సాయంత్రం భేటీ
  • కేడర్‌ అభిప్రాయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లనున్న నాగబాబు
  • ఆరణి శ్రీనివాసులును బ్లాక్ మెయిల్ చేస్తున్న జనసేనకు చెందిన ఒక వర్గం
  • చంద్రబాబు మైండ్ గేమ్‌లో భాగంగానే తిరుపతి ఉమ్మడి అభ్యర్థిపై వివాదం
  • లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకుని వచ్చి ఆరని శ్రీనివాసులుతో పనిచేయలేమంటున్న జన సైనికులు, టీడీపీ నాయకులు
  • మరోసారి అభ్యర్థి ఎంపికపై సర్వే చేస్తామని హామీ ఇచ్చిన నాగబాబు
  • జనసేన పార్టీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్దం అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేత వూకా విజయకుమార్
  • మరోసారి తిరుపతి ఉమ్మడి అభ్యర్ధి ఎంపికపై పునరాలోచనలో జనసేన
  • టీడీపీ మద్దతు ఉంటుందని ఆరని శ్రీనివాసులుకు హామీ ఇచ్చిన నారా లోకేష్

07:30 AM, March 22nd, 2024
బాలకృష్ణకు ఓటమి భయం.. 

  • హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఓటమి భయం
  • హిందూపురం ఓటర్లకు బాలకృష్ణ ప్రలోభాలు
  • హిందూపురం నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు
  • చీరలు తీసుకోండి.. బాలకృష్ణకు ఓటేయండి అంటున్న టీడీపీ నేతలు
  • చీరలు, బాలకృష్ణ ఫోటోలతో కూడిన క్యాలెండర్లు, ఓటరు జాబితా స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • హిందూపురంలో టీడీపీ నేతల ప్రలోభాలపై సర్వత్రా విమర్శలు


07:10 AM, March 22nd, 2024
సైకిల్‌పై డాలర్‌ ‘సవారీ’

  • టీడీపీలో చక్రం తిప్పుతున్న ఎన్‌ఆర్‌ఐ ‘రాజా’ 
  • చంద్రబాబు, లోకేశ్‌ అమెరికాకు వెళితే ఈయన ఇంట్లోనే బస 
  • ఆ చొరవతోనే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లా సీట్లకేటాయింపు లో జోక్యం
  • రాజా ఏం చెబితే దానికి ఓకే అంటున్న చంద్రబాబు.

07:00 AM, March 22nd, 2024
ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ

  • బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ
  • పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ
  • ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత
  • ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు
  • బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం
  • ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు
  • రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు
  • వైజాగ్‌లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్
  • అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్
  • రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు
  • అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత
  • ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి
  • తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు
  • విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్

06:50 AM, March 22nd, 2024
పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ

  • పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు
  • పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు
  • ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు
  • కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు
  • ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు
  • ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు
  • సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ

06:40 AM, March 22nd, 2024
పవన్‌కు ఎదురు తిరిగిన పోతిన మహేష్‌

  • విజయవాడ వెస్ట్‌  సీటు ఆశించిన పోతిన మహేష్‌
  • టికెట్‌ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్‌
  • పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్‌
  • పవన్‌ కుదరదని చెప్పడంతో రెబల్‌గా బరిలోకి  దిగాలని నిర్ణయం
  • ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని పవన్‌కు స్పష్టం చేసిన పోతిన మహేష్‌

06:30 AM, March 22nd, 2024
మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్‌ మల్లగుల్లాలు 

  • ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్‌లో బాబు, పవన్‌ చర్చలు
  • చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్‌ నివాసంలో కలిసిన పవన్
  • ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ 
  • ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 
  • 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు 
  • ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement