April 12th AP Elections 2024 News Political Updates..
12:06 PM, April 12th 2024
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది: మంత్రి బొత్స సత్యనారాయణ
- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం
- స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది
- ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని సీఎం జగన్ చెప్పారు
- స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యమని కుటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా?
- స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని గంటా చెప్పారు
- రాజీనామా చేసిన గంటా.. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో ఎలా జత కడతారు
- మోసం చేయడానికి ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నీకు అంతా అమాయకంగా కనిపిస్తున్నారా?
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం
- స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడమే మా ధ్యేయం
- స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కుటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదు
- ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరుతూ పురందేశ్వరి లేఖలు రాస్తున్నారు
- గత ప్రభుత్వాల్లో ఇదే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయలేదా?
- ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించి హెరిటేజ్, మార్గదర్శి మేనేజర్లను ఎన్నికలు అధికారులుగా నియమించాలని పురందేశ్వరిని లేఖల రాయమనండి
- కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?
- చంద్రబాబు, పురందేశ్వరి ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వేసిన ప్రజలు నమ్మరు
11:15 AM, April 12th 2024
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
- టీడీపీ, బీజేపీని వదిలి వైఎస్సార్‌సీపీలో చేరిన కీలకమైన నేతలు
- తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కీలక నేతలు
- పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి
- ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ
- కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి
- కోడుమూరు నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి
- బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్
9:32 AM, April 12th 2024
ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్
- పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం
- ఒంగోలు ఘర్షణలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు
- ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపాటు
7:59 AM, April 12th 2024
చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల
- షర్మిలపై వైఎస్సార్‌టీపీ ఫౌండర్, వైఎస్సార్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్
- చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది
- వైఎస్ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు
- ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు..
- కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు
- వైఎస్సార్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం.
- వైఎస్సార్ వీరాభిమానులుగా మేం సహించలేం
- వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలది ఆదర్శనీయమైన కుటుంబం
- వారెంతో మందికి మేలుచేశారని.. కానీ, ఆ కుటుంబం నుంచి వచ్చి షర్మిల మానసిక పరిస్థితేంటో అర్థంకావడం లేదు
- ఆమె ఏడున్నరేళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్సార్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డాం
- షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది
- ఆడ బిడ్డను కాదు, ఈడ బిడ్డనే అంది.. నా మెట్టినిల్లు తెలంగాణ అంది, పాదయాత్ర చేసింది.
- 119 సీట్లులో పోటీచేస్తానంది.. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి.. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసింది
7:10 AM, April 12th 2024
చంద్రబాబు పనికిమాలిన ఎత్తుగడలు
- ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'!
- 2014–19 మధ్య తాను చేసిందేమీ లేక... చంద్రబాబు దుష్ప్రచారం
- విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు... అంటూ రోజూ అరుపులు
- అంటే ఏంటో... రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదు
- బడులను బాగు చేసి, విద్యా వ్యవస్థను సంస్కరించటం విధ్వంసమా?
- నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవటం నాశనం చేయటమా?
- సాగును బాగు చేసి, రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా?
- సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం, గ్రామాలకు కొత్త కళ తేవటం తప్పా?
- పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా?
- ఐదేళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా?
- ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి... బాబు తిట్ల దండకం
- ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు
7:05 AM, April 12th 2024
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
- ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం
- హౌసింగ్ బోర్డు వద్ద భోజన విరామం
- సాయంత్రం గుంటూరులో ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ
- నంబూరు బైపాస్ వద్ద రాత్రి బస
6:59 AM, April 12th 2024
ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం
- నిబద్ధత, నిజాయితీతో పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జన నీరాజనం
- మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటా పోటీ
- వైఎస్సార్‌సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు
- కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం
- ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ వీడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన
- గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీలు కుదేలవడం ఖాయమంటోన్న రాజకీయ పరిశీలకులు
6:57 AM, April 12th 2024
రాజకీయాల్లో నటించకు పవన్..
- పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్‌లు చేసుకోండి.. సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో వద్దు
- కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు
- సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి
- పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్లులా కనిపిస్తున్నారా?
- స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలిగానీ, స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడమేమిటి?
- కాపు సంఘ సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
6:56 AM, April 12th 2024
చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తోంది
- మహిళలకు 50 శాతం అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడంలేదు?
- బీసీ, పేద ఓసీలు, కాపులు, మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏమిటి?
- సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలి
- చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేసిన ఎస్‌జేఎఫ్
6:53 AM, April 12th 2024
మహిళా వలంటీర్లపై గూండాగిరి
- పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం
- కుర్చిలు విరగ్గొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైనం
- బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు
- ఓ గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకోని వైనం
- భయంతో స్పృహ తప్పిన గర్భిణి.. ఓ యువతి
- ఫోన్‌తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్
- పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలోనే మహిళలు
- జనసేన అభ్యర్థి నానాజీ, మరికొందరిపై క్రిమినల్ కేసు
6:47 AM, April 12th 2024
వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే: సజ్జల రామకృష్ణారెడ్డి
- నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడింది చంద్రబాబే
- తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం
- ఆ కమిటీల్లో సభ్యులనే వలంటీర్లను చేయాలనుకుంటున్నారు.. ఇది జరగని పని
- మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం
- బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది.. మార్పులు ఉండవు
చట్టంలోని లొసుగులు తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి రామోజీ.
— YSR Congress Party (@YSRCParty) April 11, 2024
ప్రజలకు నీతులు చెప్పే రామోజీ.. ఏ రోజైనా నిష్పక్షపాతంగా ఉన్నాడా?
-వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#ScamsterRamoji#MargadarsiScam pic.twitter.com/UTZ9WUCKqj
Comments
Please login to add a commentAdd a comment