April 11th: ఏపీ ఎన్నికల సమాచారం | AP Elections 2024: Political News In Telugu On April 11th Updates | Sakshi
Sakshi News home page

April 11th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Thu, Apr 11 2024 6:53 AM | Last Updated on Thu, Apr 11 2024 8:08 AM

AP Elections 2024: Political News In Telugu On April 11th Updates - Sakshi

April 10th AP Elections 2024 News Political Updates..

8:00 AM, April 11th 2024
ఎలాగూ చేయం కదా.. మాట ఇచ్చేదాం!

  • అలవి కాని హామీలు... అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు
  • రోజుకో హామీతో ప్రజలను మభ్య పెడుతున్న టీడీపీ అధినేత.. నిన్న మొన్నటి వరకూ సూపర్‌ సిక్స్‌ పేరుతో మాయ మాటలు
  • అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల.. ఇప్పుడు ప్రజామేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు 
  • గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది.. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి
  • ఇప్పుడు అదే రీతిలో హామీలిచ్చేస్తూ హంగామా

7:40 AM, April 11th 2024

టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు

  • రాష్ట్రవ్యాప్తంగా కుదేలవుతోన్న కూటమి 
  • వరుస దెబ్బలతో తేరుకోలేకపోతున్న టీడీపీ
  • రాజంపేట కూటమిలో కుంపట్లు..పోటాపోటీగా ప్రచారం 
  • ఉండి టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు 
  • తిరుగుబాటు ధోరణిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు 
  • రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై తీవ్ర మండిపాటు 
  • హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పదేళ్లు ఉన్నాఅభివృద్ధి చెందలేదన్న విమర్శలు 

7:20 AM, April 11th 2024
జనసేన ఖాళీ..

  • కోనసీమలో ఖాళీ అయిన జనసేన 
  • ఒక్కొక్కరుగా నాయకులంతా వైఎస్సార్‌సీపీలో చేరిక
  • టికెట్లు ఇస్తామని ఆశ చూపి చివరికి ఇవ్వకపోవడంతో విసుగు చెంది పార్టీని వీడుతున్న నేతలు
  • ఇప్పటికే ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా
  • సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక 
  • తాజాగా జనసేన పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి
     

7:00 AM, April 11th 2024
చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ 

  • చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోంది  
  • ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది
  • మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు
  • వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారు
  • చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు
  • ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్‌తో రామోజీ డొంకంతా కదిలింది
  • రోజూ పేపర్‌లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట
  • కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు
  • సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది 
  • సీఎం జగన్‌ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు
  • దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు
  • కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ 
  • టిప్పర్ డ్రైవర్‌కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు
  • రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్‌లో రాయడు
  • కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు
  • కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు 
  • మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ
  • మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు
  • పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు
  • నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా?
  • వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా
  • ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది
  • వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా
  • మార్గదర్శి మోసాల పై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా
  • అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు
  • చంద్రబాబు పదివేలు కాదు..నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు..వాలంటీర్లు నమ్మరు
  • ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం
  • చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా

6:50 AM, April 11th 2024
తుప్పు పట్టిన సైకిల్‌ను తిప్పికొట్టాలి: పిడుగురాళ్ల సభలో సీఎం జగన్‌

  • ఈజ్ అఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్‌గా ఉంది
  • రైతన్నకు చంద్రబాబు చేసిందేమి లేదు
  • గతంలో ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తారట
  • 14 ఏళ్ల పాలనలో రైతుకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి ?
  • వ్యవసాయం దండగన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు
  • రైతులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు
  • 2014 మేనిఫెస్టో లో రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు
  • కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు
  • రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని మోసం చేశారు
  • రైతులకు సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు
  • బాబుది బోగస్ రిపోర్ట్ .. జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్
  • మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం
  • ప్రతి వై ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం
  • పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
  • 58 నెలల కాలంలో 17 వందల కోట్లు ఫీడర్ల పై ఖర్చు చేశాం
  • 5 ఏళ్లలో రైతు భరోసా ద్వారా రూ. 67,500 ప్రతి రైతుకు ఇచ్చాం
  • ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం
  • విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం
  • రూ. 64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం
  • ఏ సీజన్ లోని ఇన్ ఫుట్ సబ్సిడీ ని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం
  • సున్నా వడ్డీకే పంట రుణాలిచ్చాం
  • 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం

6:40 AM, April 11th 2024
పవన్ కల్యాణ్‌కి తణుకు పట్టణంలో నిరసన సెగ

  • వారాహి యాత్రలో తణుకు టిక్కెట్ విడివాడ రామచంద్రరావు కి ప్రకటించిన పవన్ కళ్యాణ్ 
  • పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్‌ను టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించిన చంద్రబాబు
  • వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ టీడీపీకి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్..
  • వారాహి యాత్రలో నీవు ఇచ్చిన మాటకు విలువేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన విడివాడ రామచంద్ర వర్గీయులు
  • గెలిచే స్థానాన్ని వదులుకోవడం త్యాగం అంటారా అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన.
  • ప్రజా గళం సభ వద్ద టీడీపీ జనసేన శ్రేణులు బాహాబాహికి దిగిన వైనం
  • ఉద్రిక్తతకు దారి తీయడంతో అదుపు చేసిన పోలీసులు

6:30 AM, April 11th 2024
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రగులుతున్న మంటలు

  • ఎమ్మెల్యే రామరాజుకు సీటు మారుస్తారన్న ప్రచారం పై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • రామరాజును పక్కనపెడితే ఊరుకోబోమని టీడీపీ కేడర్ వార్నింగ్
  • రామరాజుకు సీటు ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని  కార్యకర్తల హెచ్చరిక
  • రాజీనామాలకు సిద్ధమవుతున్న ఉండి టీడీపీ నేతలు
  • సీటు మారిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న ఎమ్మెల్యే రామరాజు
  • ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటన
  • తణుకు, నిడదవోలులో ఉమ్మడి ప్రజాగళం సభలు
  • సాయంత్రం తణుకు నరేంద్ర సెంటర్ లో బహిరంగ సభ
  • రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్
  • తణుకు, నిడదవోలు సభల్లో కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్
  • నిడదవోలు సభలో పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి
  • సభలు సరే, క్యాడర్‌ లేకపోతే ఎలా అని కూటమిలో నేతల మల్లగుల్లాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement