సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నుంచి మరో సిద్ధం సభ ఖరాయింది. మార్చి మొదటి వారంలో సిద్ధం సభతో తమ ఎన్నికల ప్రచారాన్ని దద్దరిల్లేలా ప్రకటనలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. నాలుగో సిద్దం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించనున్నట్టు తెలిసింది. మార్చి మొదటి వారంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరగనుంది.
జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు. నాలుగు జిల్లాల శ్రేణులతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరు కానున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈ సారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కంచుకోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్సార్‌సీపీ ఎంచుకుంటోంది
భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ తొలిసారి మాత్రమే గెలిచింది. ఇక్కడ భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైఎస్సార్‌సీపీ కేడర్ లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. నాలుగు ముఖ్యమైన రీజియన్‌లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్‌సీపీ.
ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై?
Comments
Please login to add a commentAdd a comment