సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. సిద్ధం సభలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పంచ్‌లతో దద్దరిల్లేలా చేశారు. సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడని అన్నారు. ‘సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరు వస్తే విసిరి కొడతాం. ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు.
... చంద్రబాబు రా .. కదలి రా అంటే ఎవరూ రావడం లేదు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగనన్న. 14 ఏళ్లు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కిన మొసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలా?. మోసగాడు కావాలా?.
... టీడీపీ కదలి రా అంటే ఎవరూ వెళ్లడం లేదు. ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నిలబెట్టుకున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు మోసం చేశారు. ఒంటరిగా వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే దత్తపుత్రుడితో కలిసి వస్తున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరు. వాళ్లది జెండా సభ కాదు.. జెండా ఎత్తేసే సభ. పవన్ సీఎం కావాలని కాపులు అడుగుతారని ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేశారు’ అని మంత్రి అంబటి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment