
సాక్షి, బాపట్ల: చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. పగటి వేశాగాళ్లు వలే సంవత్సరానికి ఒకసారి బయటి వచ్చి పద్యాలు, మాటలు చెప్పి.. చందాలు పట్టుకొని పోయిన విధంగా ఇవాళ మరల చంద్రబాబు బయటకు వచ్చారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సిద్ధం సభలో కాకాణి ప్రసంగించారు.
‘చంద్రబాబు రకరకాల వాగ్ధానాలు చేస్తున్నారు. సీఎం జగన్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి సీఎం జగన్ ఒకసారి బటన్ నొక్కితే.. తాను ఐదు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నానని నాలుక మడతబెట్టి మాట్లాడుతున్నాడు. అమ్మ ఒడిపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పడు మళ్లీ మాట మార్చాడని మండిపడ్డారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు... 2024లో జగనే సీఎం అవుతారు’ అని కాకాణి అన్నారు.