సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్.. బాబు&కోపై పంచ్‌లు వేశారు.
- ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకటే ఒక సూటి ప్రశ్న
- ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది?
- ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు
- పార్టీల పొత్తులతో బాబు ... ప్రజలే బలంగా మనం
- తలబడపోతున్న మహాసంగ్రామానికి మీరంతా సిద్ధమా..?
- జగన్‌ను ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం
- మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి మీరంతా సిద్ధమా...?
- సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం.. సిద్ధమంటే ప్రజాసముద్రం
- ఇప్పటీకే ఉత్తారంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం
- ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం
- నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్
- మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి
- చంద్రబాబు జేబులో ఉన్న మరో నేషనల్ పార్టీ
- చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు లేవు
- టైర్లు లేవు.... చంద్రబాబు సైకిల్ తుప్పుపట్టింది
- ఈ తుప్పు పట్టిన సైకిల్ తోయడానికి వేరే పార్టీలు కావాలి
- సైకిల్ చక్రం తిరగక.. ఢిల్లీ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడు
- చిత్తశుద్ధితో మనం చేసిన మంచే చంద్రబాబును పొత్తుల వైపు పరుగులు పెట్టేలా చేసింది
- విరగగాసిన మామిడి చెట్లులా మనముంటే.. తెగులుపట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది
- మీ అన్న మాటిస్తే.. తగ్గేదేలే
- రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర, నాది అర్జునుడి పాత్ర, ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధం
- చంద్రబాబు సైకిల్ తప్పు పట్టిపోయింది, టీడీపీకి సైకిల్ కు టైర్లు లేవు, ట్యూబ్ లు లేవు, తుప్పుపట్టిన సైకిల్ ను తోయడానికి ఇతర పార్టీలు కావాలి
- శకుని చేతిలోకి పాచికలకు .. బాబు ఇచ్చిన వాగ్దానాలకు తేడా లేదు, చంద్రబాబు తాజా మేనిఫెస్టో లోని వాగ్దానాలు చూస్తే పక్క రాష్ట్రాల్లోంచి కొన్ని హామీలు తీసుకొచ్చి కిచిడి చేస్తాడు
- మంచి చేసి మేం విరగకాసిన మామిడిచెట్టులా ఉంటే మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచినందుకు చంద్రబాబు పరిస్థితి తెగులుపట్టిన చెట్టులా ఉంది
- ఫ్యాన్ ఇంట్లో ఉండాలి .. సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి
- మీ అన్న చేసేదే మేనిఫెస్టో లో పెడతాడు, మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే, చేసేదే చెప్తాం .. చెప్పామంటే చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment