పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కోటా శరత్
సిద్ధం సభకు మద్యం తాగి రాయితో వెళ్లిన యువకుడు
చెకింగ్ పాయింట్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడు మంతెన గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు
కంకిపాడు: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మరో దాడికి కుట్ర జరిగింది. విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుడివాడలో సోమవారం మరోసారి దాడిచేసి, అల్లర్లు సృష్టించటమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్రపన్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేయత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో కుట్రభగ్నమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు.
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోటా శరత్ అలియాస్ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణానికి ప్రవేశించే యత్నం చేశాడు. పోలీసులు శరత్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద రాయిని స్వా«దీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు. శరత్‌తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచి్చనట్లు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించటం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? కారణం ఏంటి? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం. – అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణాజిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment