మేదరమెట్ల సభ జనసంద్రాన్ని ముందే ఊహించి చీప్‌ట్రిక్స్‌కు బరితెగించిన పచ్చ ముఠా
ఉదయం ఫొటోలు తీసుకుని జనం మొహం చాటేశారంటూ పైశాచికానందం
అందుకే 45 నిముషాల ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారంటూ విచిత్ర విమర్శలు
వాటిని అందిపుచ్చుకుని ఊగిపోయిన ఎల్లో మీడియా
ఈ సభను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించిన 1.50 కోట్ల మంది
ఘోర పరాజయం భయంతోనే చౌకబారు ఆరోపణలంటూ ఏకిపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు ప్రజాసముద్రం పోటెత్తింది. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచింది. పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీని మళ్లీ గెలిపిచేందుకు సిద్ధమా అని సీఎం జగన్ పిలునిస్తే.. మేం సిద్ధమే అంటూ లక్షలాది మంది ఒక్కసారిగా పిడికిళ్లు పైకెత్తి మేం సిద్ధమే అంటూ చేసిన సింహనాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ మూడు సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడం.. టీడీపీ–జనసేన పొత్తు లెక్కతేలాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తమకు ఘోర పరాజయం తప్పదనే భయంతో గజగజ వణికిపోయారు. ఎన్నికల్లో కనీసం ఉనికినైనా చాటుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లి కాళ్లబేరానికి దిగజారి బీజేపీతో జట్టు కట్టారు.
ప్రభంజనాన్ని ముందే పసిగట్టి చౌకబారు డ్రామాలు..
మరోవైపు.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సిద్ధం చివరి సభకూ లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని గ్రహించిన చంద్రబాబు తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టారు. సభా ప్రాంగణంలో ఉ.11 గంటలకు ముందు ఫొటోలు తీయించారు. ఆ తర్వాత.. నవ్విపోదురు గాక నా(రా)కేంటి సిగ్గు అనే రీతిలో జనం పలుచగా ఉన్నారని, సిద్ధం సభ ఫెయిల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పచ్చముఠా వీరంగం వేసింది. తండ్రికి తగ్గ తనయుడినని లోకేశ్ కూడా ఎక్కడా తగ్గకుండా చౌకబారు డ్రామాకు తెరతీసి రెచి్చపోయారు.
ఇక సభకు హాజరయ్యే ప్రజలు కూర్చోవడం కోసం కింద గ్రీన్‌మ్యాట్ వేస్తే.. జనం హాజరుకాకున్నా హాజరైనట్లు చూపేలా గ్రాఫిక్స్ సృష్టించేందుకు వాటిని వేసినట్లు హోరెత్తించారు. అందుకే సభ ప్రత్యక్ష ప్రసారాలను 45 నిముషాలు ఆలస్యంగా ఇస్తున్నారంటూ ఇష్టమొచి్చనట్లు చౌకబారు ఆరోపణలు చేశారు. సభ పూర్తయిన తర్వాత ఉదయం తాము తీసిన ఫొటోలను గ్రాఫిక్స్ ద్వారా మాయచేసి జనం హాజరుకాకున్నా హాజరైనట్లు వైఎస్సార్‌సీపీ చిత్రీకరించిందంటూ ఎల్లో మీడియా శివాలెత్తింది. తద్వారా కూటమి శ్రేణులు డీలాపడకుండా చేసేందుకు ఈ ముఠా ఆపసోపాలు పడింది.
లైవ్‌లో 1.50 కోట్ల వ్యూస్‌తో రికార్డు..
ఇక మేదరమెట్ల సిద్ధం సభకు దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రీతిలో జనంతో కిక్కిరిసిపోయింది. మేదరమెట్ల నుంచి రేణంగివరం మధ్య సుమారు 18 కిమీల పొడవున జనప్రవాహం కొనసాగడం.. కోల్‌కత–చెన్నై జాతీయ రహదారితోపాటు అద్దంకి–నార్కాట్‌పల్లి జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్, కేబుల్ టీవీలు, జాతీయ మీడియా ద్వారా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఇలా 1.50 కోట్ల వ్యూస్‌తో మేదరమెట్ల సభ చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలడంతో కూటమి నేతలు వణికిపోతున్నారు. ఆ భయంతోనే ఎల్లో ముఠా ఇలా చీప్‌ట్రిక్స్ ప్రయోగిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment