పాలమూరు ప్రాజెక్టు రీడిజైన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
కేఎల్‌ఐ ప్రాజెక్టు వైఎస్ పుణ్యమే
Published Wed, Jul 27 2016 11:20 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
కొల్లాపూర్‌రూరల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎల్లూరు శివారులోని పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త డిజైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎతిపోతల కొత్త రీడిజైన్ ద్వారా కేఎల్‌ఐ ప్రాజెక్టు కింద 90వేల ఎకరాల ఆయకట్టును రైతులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు సమీపంలో పాలమూరు రీడిజైన్ ప్రాజెక్టు పనులు చేపట్టడం విడ్డూరమన్నారు. దీనివల్ల కేఎల్‌ఐకి పూర్తిగా ప్రమాదం పొంచి ఉందన్నారు.
ఈ సందర్భంగా పాలమూరు ప్రాజెక్టు రీడిజైన్ వివరాలను డీఈ ప్రవీణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే అగ్రిమెంట్ పనులు జరుగుతున్నాయని, కొత్తగా ఎలాంటి పనులు చేయడం లేదని డీఈ వివరించారు. కొల్లాపూర్ రైతులను ముంచేందుకే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కేఎల్‌ఐ ఆయకట్టుకు ఎలాంటి ముప్పువాటిల్లినా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగినేని జగదీశ్వరుడు, నాగరాజు, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు జంబులయ్య, సురేందర్‌సింగ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పస్పుల కష్ణ, ప్రధాన కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement