
మాల్స్‌లో డెబిట్ కార్డు ఉపయోగిస్తే పిన్ తప్పదు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్), మాల్స్‌లో అన్ని బ్యాంకుల డెబిట్ కార్డ్‌లు ఉపయోగించేటప్పుడు కస్టమర్లు పిన్ నంబర్‌ను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. ఆదివారం నుంచీ ఈ విధానం అమల్లోకి వస్తుంది. మోసాలను అరికట్టే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ విధానం జూన్ నుంచీ అమల్లోకి రావాల్సి ఉంది.
అయితే బ్యాంకుల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం అమలు గడువును ఆర్‌బీఐ నవంబర్ 30 వరకూ పొడిగించింది. దీనిప్రకారం ఇక మీదట పాయింట్-ఆఫ్-సేల్స్ (పీఓఎస్), మాల్స్, దుకాణాల్లో డెబిట్ కార్డ్ వినియోగం సందర్భాల్లో ఇకపై తప్పనిసరిగా వినియోగదారులు తమ రహస్య పిన్ నంబర్‌ను కొట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్డ్ వినియోగంలో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు సూచించారు.