
పనిచేయని ‘క్యాష్ ..పాస్’
కర్నూలు(హాస్పిటల్): పెద్దాస్పత్రిలో క్యాష్..పాస్ పేరుతో డెబిట్‌కార్డులపై నగదు పంపిణీ కార్యక్రమం ఒక్కరోజుకే పరిమితమైంది. నగదు లేక రోగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రెండు వారాల క్రితం జిల్లా అధికారులు కౌంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం రెండు గంటలు మాత్రమే ఇది పనిచేసింది. ఆ తర్వాత బ్యాంకు అధికారులు రాలేదు.. కౌంటరూ తెరవలేదు. ప్రజలు మాత్రం.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గాకుండా కనీసం పెద్దాసుపత్రిలోనైనా నగదు దొరుకుతుందని ఆశించి వచ్చి భంగపడుతున్నారు.