ఇంటివద్దకే నగదు...స్నాప్డీల్ బంపర్ ఆఫర్
ఇంటివద్దకే నగదు...స్నాప్డీల్ బంపర్ ఆఫర్
Published Thu, Dec 22 2016 1:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద గరిష్టంగా ఒక బుకింగ్కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్లో స్వైప్ చేసి స్నాప్డీల్కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది.
బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీసులతో గంటల కొద్దీ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ఎలాంటి అవస్థలు పడకుండా సులభతరంగా నగదు అందేలా చేయనున్నామని కంపెనీ చెప్పింది. "Cash@Home" సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్డీల్ స్వీకరించదు. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను కంపెనీ లైవ్గా ప్రారంభించింది. మిగతా మేజర్ నగరాల్లో ఈ సర్వీసులను కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది.
Advertisement