doorstep
-
ఇంటి వద్దకే ఇసుక
-
ఇకపై పెట్రోల్ డోర్ డెలివరీ..!
-
ఇకపై పెట్రోల్ డోర్ డెలివరీ..!
న్యూఢిల్లీ: మే 14నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ పంపుల మూత నిర్ణయానికి చెక్ చెప్పిన చమురు మంత్రిత్వ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై వినియోగదారులవద్దకే నేరుగా పెట్రోల్ డెలివరీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. వినియోగదారులు ప్రీ-బుకింగ్ చేస్తే హోం డెలివరీ చేస్తమాని, ఇంధన స్టేషన్లలో సుదీర్ఘ క్యూలను తగ్గించటానికి ఇదిసహాయపడుతుందని ట్వీట్ చేసింది. పెట్రోల్ స్టేషన్ల వద్ద సుదీర్ఘ క్యూలను నిరోధించే క్రమంలో ఇంటికే పెట్రోల్‌ను పంపించే యోచనలో ఉంది. ఈ మేరకు శుక్రవారం చమురు మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ముందస్తు బుకింగ్ చేసినట్లయితే పెట్రోలియం ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా ఇంటికే ప్రభుత్వం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వరుస ట్వీట్లలో ప్రకటించింది. పెద్ద క్యూలలో వేచి వుండడం వల్ల వృధా అవుతున్న వినియోగదారులు సమయం ఆదా అవుతుందని భావించింది. “Options being explored where petro products may be door delivered to consumers on pre booking” @dpradhanbjp (1/2) — Petroleum Ministry (@PetroleumMin) April 21, 2017 -
ఇంటివద్దకే నగదు...స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్
పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద గరిష్టంగా ఒక బుకింగ్‌కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్‌లో స్వైప్ చేసి స్నాప్‌డీల్‌కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది. బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీసులతో గంటల కొద్దీ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ఎలాంటి అవస్థలు పడకుండా సులభతరంగా నగదు అందేలా చేయనున్నామని కంపెనీ చెప్పింది. "Cash@Home" సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్‌డీల్ స్వీకరించదు. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను కంపెనీ లైవ్‌గా ప్రారంభించింది. మిగతా మేజర్ నగరాల్లో ఈ సర్వీసులను కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. -
ప్రజల వద్దకే మలేరియా డిటెక్షన్ యూనిట్!
మలేరియాను నిర్మూలించడంలో మంగళూరు అధికారులు మరో అడుగు ముందుకేశారు. కర్నాటక ప్రాంతంలో గుర్తించిన మొత్తం 7800 మలేరియా కేసుల్లో మంగుళూరులోనే 4000 వరకూ ఉండటంతో అప్రమత్తమయ్యారు. ప్రజా వైద్య సౌకర్యాలను మెరుగు పరిచే దిశగా మొబైల్ మలేరియా డిటెక్షన్ యూనిట్ ను ప్రారంభించారు. కర్నాటక మంగుళూరు నగరంలో మలేరియా నివారణ, నియంత్రణ దిశగా చర్యలు ప్రారంభించారు. కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మొదటిసారి మొబైల్ మలేరియా గుర్తింపు యూనిట్ ను ప్రారంభించింది. ఆరుగురు నిపుణుల బృదంతోపాటు, విశ్లేషణా పరికరాలు, మందులతో కూడిన వాహనాన్ని అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్న మంగళూరు నగరంలో మార్చి 19న ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కార్మికులు ఉచిత పరీక్ష, చికిత్స అందించడంతో పాటు... విశ్లేషణా కిట్ సహాయంతో నిమిషాల్లో ఫలితాలను అందిస్తారు. ముందుగా రక్త నమూనాలను సేకరించి కిట్ ద్వారా పరిశీలిస్తారు. ఫలితం ప్రతికూలంగా చూపితే.. రక్త నమూనాలను మరింత విశ్లేషణ జరిపేందుకు మలేరియా టెస్టింగ్ సెంటర్ కు పంపిస్తారు. ఫలితాలు సానుకూలంగా చూపితే రోగులకు వెంటనే మందులను అందిస్తారు. రక్త పరీక్షలతోపాటు, మందులుకూడ ఉచితంగానే ఇస్తారు. ప్రజలు ఒక్క ఫోన్ కాల్ చేసి, అడ్రస్ ఇస్తే చాలు అరగంటలోపు మొబైల్ యూనిట్ వారింటిముందుండేట్టుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఈ సౌకర్యం వినియోగించుకొనేందుకు ఓ హాట్ లైన్ నెంబర్ (9448556872) ను ప్రవేశ పెట్టారు. మలేరియా పరీక్షలు నిర్వహించిన ప్రతి వ్యక్తి వివరాలను ఈ మొబైల్ యూనిట్ రిజిస్టర్ చేస్తుంది. మలేరియా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఆ వివరాలను మంగళూరు సిటీ కార్పొరేషన్ కు అప్పగిస్తుంది. గతేడాది అక్టోబర్ లో స్థాపించిన మలేరియా కంట్రోల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ద్వారా ఆ వివరాలను అప్ లోడ్ చేస్తారు. నగరంలోని మలేరియా కేసుల వివరాలను తెలిపేందుకు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ మ్యాపింగ్ టూల్ గా ఉపయోగపడుతుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి చికిత్సా కేంద్రానికి అనుబంధంగా ఈ మొబైల్ యూనిట్.. సేవలు అందిస్తుందని జిల్లా డిసీజ్ కంట్రోల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఎస్ బి. తెలిపారు.