సాక్షి, న్యూఢిల్లీ: డెబిట్ కార్డు లావాదేవీలను బ్లాక్ చేసిందంటూ వచ్చిన వార్తలపై భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) స్పందించింది. తాము ఎలాంటి పేమెంట్ గేట్‌వేను రద్దు చేయలేదని ప్రకటించింది. డెబిట్ కార్డ్ పేమెంట్లను నిలిపివేసిందన్న చేసిన వార్తలు అవాస్తవమని ఖండించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లతో స్పష్టత ఇచ్చింది. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయని, నిలిపేయలేదని స్పష్టం చేసింది.
పలు బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డు ద్వారా అన్ని లావాదేవీలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని తెలిపింది. ఏ పేమెంట్ గేట్‌వే నుంచి అయినా అన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను చేసుకోవచ్చని తెలిపింది.
కాగా కన్వీనియన్స్ ఫీజు వివాదం నేపథ్యంలో పలు బ్యాంకుల డెబిట్‌కార్డుల పేమెంట్‌ను రద్దు చేసిందని దీంతో డెబిట్‌కార్డ్ వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలగనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే
No truth in news of having blocked any card of any bank. 5/5
— IRCTC (@IRCTC_Ltd) September 23, 2017