ప్రస్తుత ప్రపంచం మొత్తం డిజిటల్ గా మారింది. బ్యాంకుకు వెల్లకుండానే చెల్లింపులు క్షణాలలో జరిగిపోతున్నాయి. చాలా మంది కరెంట్ బిల్, టీవీ బిల్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ బిల్లు, ఇతర ఈఎంఐల వంటి వాటికి ఆటో డెబిట్ అనే సదుపాయం వినియోగించుకుంటున్నారు. ఈ ఆటో డెబిట్ సదుపాయం వల్ల ఏదైనా బిల్లు గడువు తేదీ మరిచిపోయినా ఆటో మెటిక్ గా సరైనా సమయానికి చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ ఆటో డెబిట్ లావాదేవీల్లో కొన్ని మార్పుల చేసింది.
ఆటో డెబిట్ లావాదేవిలకు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ అనే సదుపాయం ఉపయోగించుకోవడం అంత సులభం కాదు. కొత్త నిబందనల ప్రకారం.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లవదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. (చదవండి: లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్!)
ఆ తర్వాత పేమెంట్ కొనసాగించాలనుకుంటే ఓటీపీతో ఆ పేమెంట్‌ను నిర్ధరించాలి. లేదంటే పేమెంట్ పూర్తవదు. అప్పుడు మాన్యువల్‌గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సి ఉండేది. కానీ, బ్యాంకుల అభ్యర్ధన మేరకు ఆరు నెలలు వాయిదా వేసింది. గడువు తర్వాత ఆర్బీఐ పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment