డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా డెబిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, మొబైల్ ఫోన్, యూపీఐ యాప్ ద్వారాజరిపే చిన్న మొత్తాల లావాదేవీలపైనా రుసుములను వసూలు చేయరాదని బ్యాంకులకు స్పష్టంచేసింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.ప్రభుత్వానికి చేసే చెల్లింపులు సహా డెబిట్ కార్డుల ద్వారా చేసే రూ.1,000 లోపు అన్ని లావాదేవీలపై ఎండీఆర్‌ను 0.25 శాతానికి పరిమితం చేసింది.