పెద్ద నోట్ల రద్దు అనంతరం డెబిట్ కార్డు వాడకాన్ని మరింతగా పెంచే దిశగా ఆర్‌బీఐ చర్యలు ప్రారంభించింది. డెబిట్ కార్డుపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను ఏప్రిల్ 1 నుంచి గణనీయంగా తగ్గించాలని ప్రతిపాదించింది. వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు, ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యాపారులు (విద్యా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూ రెన్స్, యుటిలిటీలు), ప్రభుత్వ ఆస్పత్రులు డెబిట్ కార్డు లావాదేవీల విలువపై 0.40% చార్జీ చెల్లించేలా ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
Published Fri, Feb 17 2017 7:29 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement