వామ్మో... సైబర్ నేరగాళ్లు | Wham ... cyber criminals | Sakshi
Sakshi News home page

వామ్మో... సైబర్ నేరగాళ్లు

Published Mon, Nov 7 2016 4:47 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

వామ్మో... సైబర్ నేరగాళ్లు

వామ్మో... సైబర్ నేరగాళ్లు

నకిలీ  డెబిట్, క్రెడిట్ కార్డుల తో వంచన
ఇద్దరి అరెస్ట్
నిందితులపై కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కేసులు

 
బెంగళూరును కేంద్రంగా చేసుకొని వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం గుట్టు రటై్టంది.  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని బ్యాంకులను, ఖాతాదారులను మోసం చేస్తున్న ఇద్దరిని  పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 బెంగళూరు (బనశంకరి) : నకిలీ క్రెడిట్, డెబిట్ కార్డులను తయారు చేసి బ్యాంకులను, ప్రజలను మోసగిస్తున్న గోవాకు చెందిన నదీమ్ షరీఫ్, అప్సర్ రెహమాన్‌లను శనివారం కాటన్‌పేటే సీఐ  కుమారస్వామి ఆధ్వర్యంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి  రూ.10 లక్షలకు పైగా నగదు,  రెండు ల్యాప్‌టాప్, రైటర్ మిషన్, 10 ఏటీఎం కార్డులు, ఒక రీడర్, రైటర్ యంత్రం, సెల్‌ఫోన్లు, ఆధార్‌కార్డు, విదేశీయులకు సంబంధించిన జిరాక్స్ పత్రాలు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా పేరుతో పీఎస్‌ఓ మిషన్, కార్పొరేషన్ కశ్మీర ఆర్‌‌ట్స నిగమ్ పేరుతో రసీదు పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ అనుచేత్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

నిందితులు బెంగళూరు చేరుకొని కాటన్‌పేట్‌లోని ఓ లాడ్జీలో తిష్టవేసి  ముంబారుు, గోవా, జమ్మూ కశ్మీర్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి తాము బ్యాంకు అధికారులమని చెప్పి  క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నెంబర్ల తెలుసుకుని నకిలీ డెబిట్, క్రెడిట్ కార్డులను తయారు చేసేవారు. అనంతరం నకిలీ కార్డులతో ఆన్‌లైన్ ద్వారా నగదు డ్రా చేసుకునేవారు.ఇలా విదేశీయులు క్రెడిట్ కార్డుల డేటా తీసుకుని మోసాలకు పాల్పడేవారు. వీరికి ఇక్కడి కమర్షియల్ స్ట్రీట్‌లో ఉన్న ఓ దుకాణం యజమాని సహకరించేవాడు. నిందితులపై కర్ణాటకతో పాటు ముంబారుు, రాజస్థాన్‌లలో కూడా కేసులు నమోదయ్యారుు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement