
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళీ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది. బిగ్ దీవాళీ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డిబెట్ కార్డు హోల్డర్లకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు ఉత్పత్తులను ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
చదవండి: Nykaa: రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..!
ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ వినియోగదారులకు రియల్ మీ సీ11, రియల్‌మీ సీ21వై, శాంసంగ్ ఎఫ్12, పోకో జీ3 ఎఫ్‌టీ, రియల్‌మీ నార్జో 50ఏ, మోటోరోలా జీ60, ఒప్పో రోనో 6 5జీ వంటి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై మరింత తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. బిగ్ దీపావళి డేస్ సేల్ సందర్భంగా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుపై 80 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. డెస్క్‌టాప్‌ల కొనుగోలుపై 30 శాతం వరకు,పవర్ బ్యాంక్‌లపై 75 శాతం వరకు తగ్గింపు , హెడ్‌ఫోన్, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
గృహోపకరణాల విషయానికి వస్తే...టీవీలపై 75 శాతం వరకు, మైక్రోవేవ్ ఓవెన్‌లపై 45 శాతం వరకు తగ్గింపు , ఎయిర్ కండీషనర్‌లపై 55 శాతం వరకు తగ్గింపు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
చదవండి: తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ
Comments
Please login to add a commentAdd a comment