
రవి
సాక్షి, సిటీబ్యూరో: యజమానికే ఆన్‌లైన్ టోకరా వేసి రూ.2 లక్షల మేర నష్టం చేకూర్చిన నిందితుడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఐదు యాపిల్ ఐఫోన్లు, రిస్ట్ వాచీ స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకా రం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డి.రవి బాగ్‌లింగపల్లి నివాసి శైలజా మోహన్ వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. ఆమెకు నమ్మినబంటుగా మారడంతో ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలు సైతం రవి తో చేయించేది.
దీన్ని ఆసరాగా చేసుకున్న రవి శైలజకు చెందిన క్రెడిట్/డెబిట్ కార్డు నెంబర్లు, సీవీవీ కోడ్ తదితరాలను సంగ్రహించాడు. ఆమె గుర్తింపుకార్డు ప్రతినీ తస్కరించాడు. ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లిన శైలజ తన సెల్‌ఫోన్ నెంబర్‌ను డీ యాక్టివేట్ చేశారు. అయితే దురుద్దేశంతో ఉన్న రవి అప్పటికే తన వద్ద ఉన్న గుర్తింపుకార్డు ఆధారంగా డూప్లికేట్ సిమ్‌కార్డు తీసుకున్నాడు. స
దీంతో పాటు క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను వినియోగించి ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల మేర షాపింగ్ చేశాడు. జూలైలో తిరిగి వచ్చిన శైలజ ఈ విషయం గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ వీపీ తివారీ ఈ కేసును దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాల మేరకు రవిని నిందితుడిగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు.