ఎస్బీఐ క్విక్తో డెబిట్ కార్డ్ మోసాలకు చెక్ | SBI Quick introduces facility to control debit card frauds | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ క్విక్తో డెబిట్ కార్డ్ మోసాలకు చెక్

Published Tue, Apr 26 2016 12:53 AM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM

ఎస్బీఐ క్విక్తో డెబిట్ కార్డ్ మోసాలకు చెక్ - Sakshi

ఎస్బీఐ క్విక్తో డెబిట్ కార్డ్ మోసాలకు చెక్

న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ మోసాలను అరికట్టడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ‘ఎస్‌బీఐ క్విక్’ పేరుతో ఒక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌ఎంఎస్ అండ్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీస్‌లో భాగంగా  ఖాతాదారులు తమ డెబిట్ కార్డ్‌లను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్), ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఎక్కడైనా ఈ సర్వీస్‌ను వినియోగించుకోవచ్చని ఎస్‌బీఐ డీఎండీ ఎన్.కె. చారి చెప్పారు..  డెబిట్ కార్డుల మోసాలను అరికట్టడానికి ఇది సరళమైన, చక్కని మార్గమని వివరించారు. ఎస్‌బీఐ క్విక్  అంటే మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, బ్యాంక్ వద్ద నమోదైన ఖాతాదారుడి ఫోన్ నంబర్‌తో ఈ సర్వీసులను పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement