కొత్త ఏడాది వచ్చేసింది. 2022 మార్చి 31తో FY21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. త్వరలోనే కేంద్ర బడ్డెట్ 2022-23ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. కాగా బడ్జెట్ 2022-23లో భాగంగా ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించిన వాటి కోసం టాక్స్ పేయర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రయోజనాలను ప్రకటించలేదు. కాగా టాక్స్ పేయర్లకు ఈ బడ్జెట్‌లో ఉపశమనం కల్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు...!
రాబోయే బడ్జెట్‌లో వేతనం పొందే టాక్స్ పేయర్లకు, పెన్షనర్లకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుంచి 35 శాతంకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబ్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే దీనిని పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే వ్యక్తిగత పన్నులపై పరిశ్రమ నుంచి పలు సూచనలు వచ్చాయి. కోవిడ్-19 రాకతో ముఖ్యంగా వైద్య ఖర్చులు పెరిగాయని, ద్రవ్యోల్భణం వంటి అంశాలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేంద్రం ఈ విషయంపై సానూకూలంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ఆర్ధికశాఖకు సూచనలు..!
ప్రతి సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పునఃపరిశీలించడాన్ని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలని బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ భాగస్వామి సుధాకర్ సేతురామ కేంద్రానికి విన్నవించారు. పెరిగిన ద్రవ్యోల్భణం, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఖర్చులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కనీసం 25 శాతం వరకు పరిమితిని పెంచాలని సూచించారు. 2019లో రూ.50,000కు పెంపు 2018లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000గా ఉంది. గతంలో దీని పరిమితిని 2019లో రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరోసారి దీనిని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల పరిస్థితిని బట్టి ప్రతిపాదన తుది ఆమోదానికి లోబడి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో లేదు.
అసలు ఏంటి స్టాండర్డ్ డిడక్షన్
ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్‌కు మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుంచి తీయడం జరుగుతుంది. కాబట్టి, ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. పన్ను చెల్లించిన మొత్తం కూడా తగ్గిపోతుంది. జీతం ఉద్యోగి మరియు పింఛనుదారుడు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు
చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!
Comments
Please login to add a commentAdd a comment