దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. దాఖలైన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను బట్టీ ఈ విషయం తెలుస్తోంది. జూలై 31న గడువు ముగిసే నాటికి 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ (AY)కి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయి. మునుపటి మదింపు సంవత్సరానికి (AY 2023-24) దాఖలైన 6.77 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇది 7.5 శాతం అధికం.
పన్ను చెల్లింపుదారుల ప్రాధాన్యతలలోనూ ఈ సారి గణనీయ మార్పు కనిపించింది. ఎక్కువ మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. దాఖలు చేసిన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, 5.27 కోట్లు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. మొత్తం ఫైలింగ్‌లలో ఇవి దాదాపు 72 శాతం. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. పాత పన్ను విధానంలో దాఖలైన ఐటీఆర్‌లు 2.01 కోట్లు. ఇది మొత్తంలో కేవలం 28% మాత్రమే.
ఇక రికార్డ్-బ్రేకింగ్ సింగిల్-డే ఫైలింగ్‌లు ఒకే రోజులో 69.92 లక్షలు. ఆఖరి రోజైన జూలై 31న ఇవి దాఖలయ్యాయి. ఒక గంటలో దాఖలైన ఐటీఆర్‌లను పరిశీలిస్తే ఈ-ఫైలింగ్ పోర్టల్ రాత్రి 7:00 నుంచి 8:00 గంటల మధ్య అత్యధిక ఐటీఆర్ ఫైలింగ్స్‌ను చూసింది. ఈ సమయంలో సగటున 5.07 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక జూలై 17న అత్యధికంగా సెకనుకు 917 ఫైలింగ్‌లు, జూలై 31న నిమిషానికి 9,367 ఫైలింగ్‌లను నమోదు చేసింది.
మొదటిసారి ఐటీఆర్ దాఖలు చేసేవారి సంఖ్య ఈ సంవత్సరం కొత్త పన్ను చెల్లింపుదారులలో పెరుగుదల కనిపించింది. ఈసారి 58.57 లక్షల మంది మొదటిసారిగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. దాఖలైన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, ఐటీఆర్-1 కింద 45.77% (3.34 కోట్లు), ఐటీఆర్-2 కింద14.93% (1.09 కోట్లు), ఐటీఆర్-3 కింద 12.50% (91.10 లక్షలు), ఐటీఆర్-4 కింద 25.77% (1.88 కోట్లు)గా ఉన్నాయి. మిగిలిన 1.03% (7.48 లక్షలు) ఐటీఆర్-5 నుంచి ఐటీఆర్-7 కేటగిరీల కింద దాఖలయ్యాయి.
The Income Tax Department appreciates taxpayers & tax professionals for timely compliance, resulting in a record surge in the filing of Income Tax Returns (ITRs).
Here are the key highlights:
👉More than 7.28 crore ITRs for AY 2024-25 filed till 31st July, 2024, a 7.5% increase… pic.twitter.com/CzbgZEMUWi— Income Tax India (@IncomeTaxIndia) August 2, 2024
Comments
Please login to add a commentAdd a comment