I-T department
-
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
ఐటీ రికార్డ్.. భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను బట్టీ ఈ విషయం తెలుస్తోంది. జూలై 31న గడువు ముగిసే నాటికి 2024-25 అసెస్మెంట్ ఇయర్ (AY)కి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయి. మునుపటి మదింపు సంవత్సరానికి (AY 2023-24) దాఖలైన 6.77 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇది 7.5 శాతం అధికం.పన్ను చెల్లింపుదారుల ప్రాధాన్యతలలోనూ ఈ సారి గణనీయ మార్పు కనిపించింది. ఎక్కువ మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. దాఖలు చేసిన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, 5.27 కోట్లు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. మొత్తం ఫైలింగ్‌లలో ఇవి దాదాపు 72 శాతం. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. పాత పన్ను విధానంలో దాఖలైన ఐటీఆర్‌లు 2.01 కోట్లు. ఇది మొత్తంలో కేవలం 28% మాత్రమే.ఇక రికార్డ్-బ్రేకింగ్ సింగిల్-డే ఫైలింగ్‌లు ఒకే రోజులో 69.92 లక్షలు. ఆఖరి రోజైన జూలై 31న ఇవి దాఖలయ్యాయి. ఒక గంటలో దాఖలైన ఐటీఆర్‌లను పరిశీలిస్తే ఈ-ఫైలింగ్ పోర్టల్ రాత్రి 7:00 నుంచి 8:00 గంటల మధ్య అత్యధిక ఐటీఆర్ ఫైలింగ్స్‌ను చూసింది. ఈ సమయంలో సగటున 5.07 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక జూలై 17న అత్యధికంగా సెకనుకు 917 ఫైలింగ్‌లు, జూలై 31న నిమిషానికి 9,367 ఫైలింగ్‌లను నమోదు చేసింది.మొదటిసారి ఐటీఆర్ దాఖలు చేసేవారి సంఖ్య ఈ సంవత్సరం కొత్త పన్ను చెల్లింపుదారులలో పెరుగుదల కనిపించింది. ఈసారి 58.57 లక్షల మంది మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. దాఖలైన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, ఐటీఆర్-1 కింద 45.77% (3.34 కోట్లు), ఐటీఆర్-2 కింద14.93% (1.09 కోట్లు), ఐటీఆర్-3 కింద 12.50% (91.10 లక్షలు), ఐటీఆర్-4 కింద 25.77% (1.88 కోట్లు)గా ఉన్నాయి. మిగిలిన 1.03% (7.48 లక్షలు) ఐటీఆర్-5 నుంచి ఐటీఆర్-7 కేటగిరీల కింద దాఖలయ్యాయి. The Income Tax Department appreciates taxpayers & tax professionals for timely compliance, resulting in a record surge in the filing of Income Tax Returns (ITRs).Here are the key highlights:👉More than 7.28 crore ITRs for AY 2024-25 filed till 31st July, 2024, a 7.5% increase… pic.twitter.com/CzbgZEMUWi— Income Tax India (@IncomeTaxIndia) August 2, 2024 -
లాలూ కుటుంబానికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ మరో షాకిచ్చింది. ఢిల్లీ, పాట్నలోని కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక లాలూ కూతురు మిసాభారతి, భర్త శైలేష్ కుమార్ ఆస్తులకు తుది అటాచ్మెంట్ ఆర్డర్‌ను జారీచేసింది. బినామి ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఐటీ ఈ చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే లాలూ ప్రసాద్‌పై ఐటీ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 5నే సౌత్ వెస్ట్ ఢిల్లీలోని బిజ్వాసాన్ ప్రాంతంలో మిసాభారతి ఫామ్‌హౌజ్‌ను ఈడీ అటాచ్ చేసింది. బినామి ఆస్తుల విచారణలో భాగంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా ఐటీ ఆగస్టులో విచారించింది. -
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
బెంగళూరు: ఆదాయపన్ను శాఖలో పనిచేస్తున్న డీగ్రూప్ ఉద్యోగి జయరాం(53) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం సాధారణంగా విధులకు హాజరైన ఆయన ముఖ్యమైన బిల్లులు, పత్రకాలపై సంతకాలు చేసి,అధికారులకు అందించారు. అనంతరం సుమారు ఉదయం 11.30 గంటలకు కార్యాలయ భవనం 6వ అంతస్తునుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. కార్పొరేషన్ సర్కిల్‌కు సమీపంలో యూనిటీ బిల్డింగ్ లోని ఐటీ శాఖ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫీసులో అదనపు పని ఉందని చెప్పి అరగంట ముందు బయలుదేరిన జయరామం అంతలోనే అనూహ్యంగా ఉసురు తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల సమాచారం ప్రకారం జయరామ్ చామ్‌రాజ్‌పేట్, ఆజాద్ నగర్ నివాసి. దాదాపు 35సంవత్సరాలుగా ఐటీ శాఖలో పనిచేస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జయరాంకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టు తమకు సమాచారం లేదనీ, సూసైడ్ చేసుకుంటారని అస్సలు ఊహించలేదని సహచరులు మీడియాతో చెప్పారు. తన తండ్రి ఆరోగ్యం గురించి కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారని జయరాం కుమారుడు రుద్రేష్ చెప్పారు. తమది సంతోషకరమైన కుటుంబమని తెలిపారు. తన సోదరికి, తనకు మంచి విద్యాభ్యాసం అందించారనీ, ఐటిఐ పూర్తి చేసి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రుద్రేష్ చెప్పారు. -
లాలూ కుటుంబంపై ఐటీ కొరడా
బినామీ చట్టం కింద రూ.180 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్ న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరుగురు కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కొరడా ఝుళిపించింది. రూ.1,000 కోట్ల భూముల క్రయవిక్రయాలకు సంబంధించి పన్ను ఎగవేతపై బినామీ లావాదేవీల (నియంత్రణ) చట్టం కింద వారి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్, కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, కుమార్తెలు చందా, రాగిణియాదవ్లకు ఐటీ నోటీసులు జారీ చేసింది. బినామీ లావాదేవీల చట్టం–2016 సెక్షన్ 24(3) కింద ఈ నోటీసులిచ్చింది. బినామీ ఆస్తుల వల్ల లాలూ వారసులు ప్రయోజనం పొందారన్న అభియోగంపై ఈ చర్యలు తీసుకుంది. ఐటీ శాఖ అటాచ్ చేసిన వాటిల్లో ఢిల్లీ, బిహారుల్లోని రూ.9.32 కోట్ల విలువైన డజను ఖాళీ స్థలాలు, భవంతులు ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ న్యూఫ్రెండ్స్ కాలనీలోని నివాస భవనం, పట్నా పుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని 9 ప్లాట్లు, ఫామ్‌హౌస్ ఉన్నాయి. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.170–180 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ప్రభుత్వ అనుమతితో అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేసుకొనేందుకు ఐటీ శాఖ సమాయత్తమవుతోంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, ఆస్తుల మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. గత నెలలో లాలూ బినామీ ఆస్తులపై ఐటీ దేశవ్యాప్తంగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాలు తనను భయపెట్టలేవని, తన వాగ్ధాటిని ఎదుర్కొనే దమ్ము లేకే బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని నాడు లాలూ వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటివి తెరపైకి వస్తున్నాయని తేజస్వీ పట్నాలో వ్యాఖ్యానించారు. కాగా, గత మే 23 నాటికి దేశ వ్యాప్తంగా 400 బినామీ కేసులను ఐటీ శాఖ గుర్తించింది. వీటిల్లో 240 కేసులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. -
ఆపరేషన్ క్లీన్ మనీ: షోకాజ్ నోటీసులు త్వరలో
న్యూఢిల్లీ: ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా అధికారులు సెకండ్ ఫేజ్ చర్యలకు దిగనునున్నారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఐటీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుమానాస్పద ఖాతాల డిపాజిట్ దారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ వచ్చే నెల నుంచి 'ఆపరేషన్ క్లీన్ మనీ' రెండో దశ ప్రారంభించడానికి రడీ అవుతోంది. 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇటీవల ప్రకటించిన ఐటీ శాఖ ఆయా ఖాతాదారులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. అనుమానాస్పద డిపాజిట్‌దారులపై చట్టబద్దమైన నోటీసులు జారీల ద్వారా వివరణ కోరనుంది. కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొన్న ఐటీ శాఖ ఆ వైపుగా కదులుతోంది. జనవరి, 31 2017 న 'ఆపరేషన్ క్లీన్ మనీ' ఆదాయపు పన్ను శాఖ లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ కింద నవంబర్ 9- డిసెంబర్ 30 2016 మధ్య కాలంలో సమయంలో చేసిన పెద్ద నగదు డిపాజిట్లపై ఐటీ కన్నేసింది. ముందుగా 18 లక్షల ఖాతాలను అనుమానాస్పందగా తేల్చింది. మొదటి దశలో ఇ-ఫైలింగ్ పోర్టల ద్వారా ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపుతూ సమాధానాల నిమిత్తం ఇచ్చిన తుది గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12వ తేదీ నాటికే సమాధానం ఇచ్చారు. ఇ-నిర్ధారణ అనంతరం వీరిలో 9 లక్షల ఖాతాలను అనుమానాస్పదంగా తేల్చిన సంగతి తెలిసిందే. -
కోటి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లోకి చేరిన లెక్కలు చూపని ఆదాయాన్ని పట్టుకునే పనిని ఆదాయపన్ను శాఖ (ఐటీ) వేగిరం చేసింది. ఇప్పటికే కోటికి పైగా బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలనను, వాటిని పన్ను చెల్లింపుదార్ల వివరాలతో పోల్చి చూసే పనిని పూర్తి చేసింది. గతేడాది నవంబర్ 10 – డిసెంబర్ 30 మధ్య కాలంలో రూ.5 లక్షలకు పైబడి సందేహాస్పద డిపాజిట్లకు సంబంధించి మూలాలు తెలియజేయాలని కోరుతూ ఇప్పటికే 18 లక్షల మందికి సందేశాలు పంపినట్టు సమాచారం. ఐటీ శాఖ రికార్డుల ప్రకారం 3.65 కోట్ల మంది వ్యక్తులు, 7 లక్షల కంపెనీలు, 9.40 లక్షల హిందూ అవిభాజ్య కుటుంబాలు, 9.18 లక్షల సంస్థలు 2014–15 సంవత్సరంలో ఐటీ రిటర్నులు దాఖలు చేశాయి. -
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
-
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. మొత్తం 586 ప్రాంతాల్లో జరిపిన సెర్చింగ్ ఆపరేషన్‌లో దాదాపు రూ.3000 కోట్లు వెలుగులోకి వచ్చినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. దానిలో రూ.79 కోట్లు కొత్త కరెన్సీ రూ.2000 నోట్లు కాగ, మిగతా రూ.2,600 కోట్లు లెక్కలో చూపనివని తెలిసింది. పట్టుబడిన నగదులో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో పట్టుబడింది. చెన్నై వ్యాప్తంగా ఏకకాలంలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా రూ.140 కోట్లు పట్టుబడినట్టు తెలిసింది. నగదుతో పాటు రూ.52 కోట్ల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని ఓ న్యాయవాది ఇంటి ప్రాంగణంలో జరిపిన తాజా తనిఖీలో రూ.14 కోట్ల నగదు పట్టుబడింది. గత అక్టోబర్‌లో లెక్కలో చూపని నగదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయపు వెల్లడి పథకం కింద ఆ లాయరే దాదాపు రూ.125 కోట్లను తను లెక్కలో చూపని నగదుగా ప్రకటించారు. రెండు వారాల క్రితం అతని బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేసిన ఐటీ అధికారులు అకౌంట్ నుంచి లెక్కల్లో చూపని రూ.19 కోట్లను సీజ్ చేశారు. ఐటీ అధికారుల దాడులతో బుధవారం పుణేలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఒక వ్యక్తికి సంబంధించిన 15 లాకర్స్ వివరాలను వెల్లడించింది. ఆ 15 లాకర్స్‌లో రూ.9.85 కోట్ల నగదు ఉందని, వాటిలో రూ.8 కోట్లు కొత్త రూ.2000 కరెన్సీ నోట్లని, మిగతావి రూ.100 నోట్లని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. గత నెలకు సంబంధించిన బ్యాంకు రికార్డులు, సీసీటీవీ పరిశీలించిన బ్యాంకు అధికారులకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద పెద్ద బ్యాగులతో బయటికి వెళ్లడం, లోపలికి రావడం దానిలో రికార్డు అయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులపై సీరియస్ అయిన ఐటీ శాఖ, విచారణ చేపట్టింది. మొత్తంగా పుణే వ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో రూ.10.80 కోట్ల నగదు పట్టుబడింది. వాటిలో రూ.8.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లున్నాయని ఐటీ అధికారులు తెలిపారు..