న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు రిటర్నుల దాఖలు గడువు సమీపించడంతో త్వరపడుతున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి 4.09 కోట్ల రిటర్నులు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఒక్క 28వ తేదీన 36 లక్షల రిటర్నులు సమర్పించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం (2022–23) రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31న చివరి తేదీ. ఇప్పటి వరకు రిటర్నులు వేయకపోతే వెంటనే ఆ పని చేయాలని, దీనివల్ల ఆలస్యపు ఫీజు చెల్లించే అవసరం ఏర్పడదని ఆదాయపన్ను శాఖ మరోసారి సూచించింది.
గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే.. వార్షిక ఆదాయం ₹ 5 లక్షల వరకు ఉన్నవారు ఫైన్ కింద ₹ 1,000, ₹ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ₹ 5,000 ఫైన్ కట్టాల్సిఉంది. ఆదాయపన్ను శాఖ గతేడాది నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. అయినా ఇప్పటికీ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు పన్ను చెల్లింపుదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువును పొడిగించాలంటూ డిమాండ్లు రాగా, గడువు పొడిగించేది లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment