నేను రిటైర్ అయ్యాను. సర్వీసులో ఉండగా పన్నుకట్టేవాణ్ని. తర్వాత కూడా చెల్లిస్తున్నాను. నా ప్రాణ మిత్రుడు ఒక ఇల్లుఅమ్ముతున్నాడు. ఆయనకి వైట్‌లో కోటి రూపాయలు, బ్లాక్‌లో రూ. 30,00,000 వస్తుంది. ఆరూ. 30,00,000 నా బ్యాంకులో నగదుగా డిపాజిట్ చేసి, వీలైనంత త్వరగా తనకు నగదు ఇవ్వమంటున్నాడు. అలా చేయవచ్చా?
ఇంతవరకు మీ ఆదాయపు పన్ను అసెస్‌మెంటు సజావుగాజరుగుతోంది. ఎటువంటి సమస్యా లేదు. ఇప్పుడు మీరు మీ మిత్రుడి నుంచి నగదు తీసుకుని,మీ అకౌంటులో డిపాజిట్ చేయగానే, అది డిపార్ట్‌మెంట్ వారి దృష్టిలో పడుతుంది.నోటీసులు ఇస్తారు. ఆరా తీస్తారు. మీరు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అంతమొత్తం ఎలా వచి్చందని అడుగుతారు. ఎవరు ఇచ్చారు, ఎందుకిలా ఇచ్చారు అన్న ప్రశ్నలువస్తాయి. చట్టప్రకారం రూ. 2,00,000 దాటి నగదు తీసుకోవడం నేరం.
శిక్ష పడుతుంది. ఇచ్చినవారికంటే పుచ్చుకున్న వారిని వివరణ అడుగుతారు. మీరు మీ ఫ్రెండ్ పేరుచెప్పారనుకోండి. ఆయన్ని అడుగుతారు. ఆయన దగ్గర్నుంచి ఒక ధృవీకరణ పత్రం అడుగుతారు.దీని ద్వారా ‘‘సోర్స్’’ ను నిర్ధారించవచ్చు కానీ, మీరు చట్టాన్ని ఉల్లంఘించినవారవుతారు. ఆ తర్వాత, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలి. నగదులో విత్‌డ్రా చేసి మీమిత్రుడికి ఇవ్వాలి. ఈ విషయంలోనూ ఆరా తీస్తారు. వివరణ ఇవ్వాలి. నోటి వివరణసరిపోదు. ఒకవేళ నిజం చెప్పినా, నగదులో పుచ్చుకున్నందుకు మీ ఫ్రెండ్‌నినిలదీస్తారు. అది పెద్ద తలకాయ నొప్పి.
ఈ సబ్జెక్ట్‌లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే (1) నగదువ్యవహరాలు చేయకూడదు
(2) నగదుడిపాజిట్/విత్‌డ్రాయల్ గురించి ఆరా తీస్తారు. ఎంక్వైరీ గట్టిగాఉంటుంది.
(3) ఈఎంక్వయిరీలో ఇద్దరూ ఒకే మాట మీద నిలబడాలి. అది సాధ్యమయ్యేనా?
(4) వివరణ సరిగ్గా ఉండకపోయినా, సంతృప్తికరంగా లేకపోయినా, పూర్తిగా లేకపోయినా.. ఆ రూ.30,00,00 ముందు మీ కేసులో ఆదాయంగా కలుపుతారు. ఆ తర్వాత సంగతి మీకు తెలియనిదేముంది?అందుకని ఎటువంటి నగదు తీసుకోకండి. తీసుకున్నా డిపాజిట్ చేయకండి. మీరు ఏ సహాయం చేయవచ్చంటే వారిదగ్గర్నుంచి చెక్కు రూపంలో పుచ్చుకుని, తిరిగి చెక్కు రూపంలో ఇవ్వొచ్చు. మరీ ప్రాణమిత్రుడైతే నగదు పుచ్చుకుని, దాచి నగదు ఇచ్చేయండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment