
న్యూఢిల్లీ: టాక్స్‌పేయర్లకు శుభవార్త! పన్ను చెల్లింపులో ఉన్న ఇబ్బందులు తొలగించేందుకు మరో వెసులుబాటును ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందుబాటులోకి తెచ్చింది. మధ్యవర్తుల జోక్యం లేకుండా పన్ను చెల్లించేలా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ పథకాన్ని 2020 ఆగస్టు 13 న ఆదాయపు పన్నుశాఖ ప్రారంభించింది. అయితే వాస్తవంలో ఫేస్‌లెస్ ద్వారా ఇన్‌కంట్యాక్స్ ఫైల్ చేసేప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
పన్ను చెల్లింపుదారులు తప్పని పరిస్థితుల్లో కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఫేస్‌లెస్ పథకం ప్రయోజనాలు పన్ను చెల్లింపుదారులు పొందలేక పోతున్నారు. ఫేస్‌లెస్ ఐటీఫైలింగ్‌లో వస్తున్న ఇబ్బందులు, ఇతర ఫిర్యాదులను తెలియజేసేందుకు వీలుగా కొత్తగా మూడు అధికారిక ఈ-మెయిల్ చిరునామాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌలభ్యం 2021 ఆగస్టు ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి వచ్చింది.
పన్ను చెల్లింపుదారులు ఈ-మెయిల్‌ళ్లకు తమ ఫిర్యాదులను అందివచ్చుననీ ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులు పరిష్కరించుకునేందుకు ఇకపై కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని... ఈమెయిల్‌తోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐటీ శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను సంబంధిత వ్యాపారాల కోసం డిపార్ట్‌మెంట్ అధికారిని కూడా కలవాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ వెల్లడించింది.
ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేసిన మూడు ఈ-మెయిల్ ఐడీలు
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్స్ కోసం: samadhan.faceless.assessment@incometax.gov.in ;
ఫేస్‌లెస్ పెనాల్టీల కోసం: samadhan.faceless.penalty@incometax.gov.in ;
ఫేస్‌లెస్ అప్పీళ్ల కోసం: samadhan.faceless.appeal@incometax.gov.in.
Grievances can be furnished as under:
— Income Tax India (@IncomeTaxIndia) August 7, 2021
For Faceless assessments: samadhan.faceless.assessment@incometax.gov.in;
For Faceless penalty: samadhan.faceless.penalty@incometax.gov.in;
For Faceless Appeals: samadhan.faceless.appeal@incometax.gov.in. (2/2)
Comments
Please login to add a commentAdd a comment