ట్యాక్స్ పేయర్స్‌కు ఎల్లప్పుడూ గౌరవం
Published Wed, Aug 3 2016 7:10 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
ఇన్‌కంట్యాక్స్ శాఖ జాయింట్ కమిషనర్ కేసీ దాసు
వినుకొండ టౌన్: ట్యాక్స్ పేయర్స్‌ను ఎల్లప్పుడూ ఇన్‌కంటాక్స్ శాఖ గౌరవంగా చూస్తుందని ఇన్‌కంటాక్స్ శాఖ జాయింట్ కమిషనర్ కేసీ దాసు అన్నారు. ఫెర్టిలైజర్స్ కల్యాణ మండపంలో ఇన్‌కంటాక్స్ శాఖ ఆధ్వర్యంలో డాల్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల పుల్లారావు అధ్యక్షతన ఆదాయ వెల్లడి పథకం–2016పై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. దాసు మాట్లాడుతూ ఆదాయ వెల్లడి పథకాన్ని టాక్స్ పేయర్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాన్ నంబర్‌తో తమ ఖాతాలను జాయింట్ చేసుకోవాలన్నారు. ఆదాయ వెల్లడి పథకం–2016 వ్యాపారుల పాలిట వరమన్నారు. అనంతరం డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీ దాసును సత్కరించారు. కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ అధికారి కామరాజు, ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్లు రామచంద్రరావు, అన్నపూర్ణ, ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు, ఎస్‌వీజే సుబ్బారావు, ఆడిటర్స్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement