అప్పుడే నూరేళ్లు నిండాయా..! | 5 years old girl died in road accident | Sakshi
Sakshi News home page

అప్పుడే నూరేళ్లు నిండాయా..!

Published Sun, Feb 18 2018 12:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

5 years old girl died in road accident - Sakshi

పోరుమామిళ్ల : ‘అప్పుడే నూరేళ్లు నిండా యా చిట్టి తల్లీ’.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృత్యువాత పడటంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రౌతుపల్లెకు చెందిన చప్పిడి వెంకటసుబ్బారెడ్డి, సునీత కూతురు తన్విత (5).

ఆ బాలిక గానుగపెంట పాఠశాలలో ఎల్‌కెజీ చదువుతోంది. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులతో బద్వేలు నుంచి ఆటోలో ఊరికి వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటి ఇంటికి వెళుతుండగా.. క్రిష్ణంపల్లె నుంచి బద్వేలు వెళుతున్న ట్రాక్టర్‌ పసిబిడ్డపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తన్విత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కూలబడిపోయారు. క్రిష్ణంపల్లెకు చెందిన ట్రాక్టర్‌ యజమాని చలపతి స్వయంగా డ్రైవింగ్‌ చేస్తుండగా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement