మండలంలోని తోకలపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ పుల్లయ్య ఒక్కగానొక్క కుమారుడు పండు(3) సోమవారం సాయంత్రం ఆటో నుంచి కింద పడి మృతి చెందాడు.
పోరుమామిళ్ల: మండలంలోని తోకలపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ పుల్లయ్య ఒక్కగానొక్క కుమారుడు పండు(3) సోమవారం సాయంత్రం ఆటో నుంచి కింద పడి మృతి చెందాడు. వివరారాలు ఇలా ఉన్నాయి. పుల్లయ్య ఆటో డ్రైవర్. సోమవారం సరదాగా కుమారున్ని ఆటోలో కూర్చోపెట్టుకుని వెళుతుండగా పండు జారి కిందపడ్డాడు. అంతే అక్కడికక్కడే చలనం లేకుండా పోయింది. చిన్నారిని రాత్రి ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారు. డాక్టర్ రహిమాన్ పరీక్షించి ప్రాణం పోయినట్లు నిర్ధారించారు. అంతే తల్లిదండ్రులు పుల్లయ్య, ధనమ్మ రోదన చెప్పనలవి కాలేదు. ఆ గ్రామం నుంచి వచ్చిన వారు వారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పండుగ రెండ్రోజులు ఉందనగా కళ్ల ముందు కన్నకొడుకు విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది.