ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | youth suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Published Sat, Feb 13 2016 5:41 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

youth suicide in nalgonda district

భువనగిరి: నల్లగొండ జిల్లాలో శనివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి పట్టణానికి చెందిన మిర్యాల విద్యాసాగర్ కుమారుడు చాణక్య(23) బీఫార్మసీ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు.

శుక్రవారం భువనగిరికి వచ్చిన అతడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి చాణక్య మరణించాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement