
సాక్షి, శ్రీకాకుళం : తనపై టీడీపీ కౌన్సిలర్ చేయిచేసుకోవడంతో అవమానం భరించలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పలాసలోని లక్ష్మీ స్వీట్ షాపులో హరీష్(24) అనే యువకుడు సెల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
14 వార్డు కౌన్సిలర్ పైల చంద్రరావు స్వీట్స్ కొనడానికి షాపుకురాగా హరీష్ చేతితో స్వీట్స్ తీస్తుండగా.. చేతిని శుభ్రం చేసుకొని తీయాలంటూ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక హరీష్ సోమవారం బెండి గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కౌన్సిలర్ చేయి చేసుకోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని షాపు యజమాని ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment