తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య | Unemployed youth commits suicide in nirmal district | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

Published Mon, Dec 4 2017 4:31 PM | Last Updated on Mon, Dec 4 2017 4:31 PM

సాక్షి, నిర్మల్‌ :  ఉద్యోగం రాలేదని మనస్తాపంతో తెలంగాణ రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం లింబా (కె)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బీఈడీ చదివిన బదుల భూమేష్‌ అనే యువకుడు గత కొంతకాలంగా ఉద్యోగం వస్తుందో రాదో అనే భయంతో మానసికంగా క్రుంగిపోయాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. అయితే గత రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో, ఇంట్లో  దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్నాడు.  ఈ ఘటనతో కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement