సగం సీజ్.. సగం సేల్ | Half of the sale of half of the Siege .. | Sakshi
Sakshi News home page

సగం సీజ్.. సగం సేల్

Published Tue, Dec 29 2015 1:41 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

సగం సీజ్.. సగం సేల్ - Sakshi

సగం సీజ్.. సగం సేల్

సీజ్ చేసిన గుడుంబాను నాటుసారా విక్రయదారులకు విక్రరుుస్తూ సొమ్ము చేసుకుం టున్న కొడకండ్ల ఎక్సైజ్ సిబ్బంది తీరుపై....

ఫుల్లు.. బిజినెస్
తప్పును కప్పిపుచ్చుకొనే యత్నాల్లో ఎక్సైజ్ అధికారులు?

 
కొడకండ్ల :  సీజ్ చేసిన గుడుంబాను నాటుసారా విక్రయదారులకు విక్రరుుస్తూ సొమ్ము చేసుకుం టున్న కొడకండ్ల ఎక్సైజ్ సిబ్బంది తీరుపై సర్వ త్రా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా రుు. దాడుల్లో పట్టుకుని లెక్కల్లో చూపని నాటు సారా ప్యాకెట్లను స్థానిక ఎక్సైజ్ కానిస్టేబుల్ నరేష్ లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన జి.సత్తయ్యకు విక్రయించడం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టేషన్‌లో సీఐ, ఎస్సై, జూనియర్ అసిస్టెంట్, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఏడుగురు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. స్టేషన్ అధికారి స్థానికంగా ఉండకుండా అడపదడపా వచ్చిపోతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇద్దరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గలీజు దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొడకం డ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని గ్రామాలు, గిరిజన తండాల్లో దాడుల సందర్భంగా స్వాధీ నం చేసుకున్న నాటుసారాను రికార్డుల్లో సగమే చూపిస్తూ మిగతా గుడుంబాను తమకు నమ్మకమైన వ్యక్తులకు విక్రరుుస్తున్నారని సదరు సిబ్బందిపై విమర్శలున్నారుు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం గుడుంబాపై యుద్ధం ప్రకటిస్తే ఈ సర్కిల్‌లో మాత్రం అధికారులు తూతూమంత్రంగా దాడు లు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నారుు.  కొందరు టోల్‌ఫ్రీ నంబర్‌కు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి భారీ నిల్వలను పట్టుకుని కేసు నమోదు చేసిన ఘటనలు జరిగారుు. స్థానిక వైన్స్‌లో కూడా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రరుుస్తూ దోచుకుంటున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారి పట్టించుకోలేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి నిర్వహించి వైన్స్‌పై కేసు నమోదు చేశారు.
 
తప్పును కప్పిపుచ్చుకునే యత్నం

ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కలిపి నడిపిస్తున్న దందాను కప్పిపుచ్చుకునేందుకు స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొడకండ్ల ఎక్సైజ్ స్టేషన్‌ను ప్రభుత్వ సారారుు దుకాణంగా మార్చిన వ్యవహారంపై జిల్లా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ ప్రారంభించకపోవడంతో జరిగిన తప్పును తారుమారు చేసే ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. ఈ దందాపై లోతుగా విచారణ చేపడితే తమ మెడకు ఎక్కడ ఉచ్చు బిగుస్తుందోనన్న భయంతోనే వారు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఏమైనప్పటికీ ఈ దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement