రోడ్డు రమ్మంటోంది..!
♦ మద్యం వ్యాపారులకు ఊరట
♦ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వర్తించని ‘సుప్రీం’ ఆదేశాలు
♦ రహదారుల సమీపంలో దుకాణాల ఏర్పాటుపై స్పష్టత
♦ న్యాయశాఖ అభిప్రాయం కోరనున్న ఎక్సైజ్ అధికారులు
♦ కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం
భీమవరం టౌన్: ‘ఊరు పొమ్మంటోంది.. రోడ్డు రమ్మంటోంది..’ అన్నట్టుగా ఉంది మద్యం వ్యాపారుల పరిస్థితి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాల ఏర్పాటును నిషే ధిస్తూ ఇచ్చిన తీర్పు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో వర్తించదని పేర్కొంటూ తాజాగా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉన్న బార్‌లు, పబ్బులు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలను ఈఏడాది మార్చి 31లోపు తొలగించాల్సిందేనంటూ గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కొందరు అప్పీల్‌కు వెళ్లగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిర్ణయం అమలుకోసం జూ న్ 30 వరకూ గడువు ఇచ్చింది. జూలై 1 నుంచి కొత్తం మద్యం విధానం అమలులోకి రావడంతో మద్యం దుకాణాలు, బార్‌లను రహదారులకు దూరంగా ఏర్పాటు చేశారు.
ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులను నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడంతో కొందరు రాష్ట్ర రహదారుల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సరైన ప్రాంతాలు దొరక్కపోవడంతో చాలా మంది తమ దుకాణాలను నివాసిత ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాల సమీపాల్లో ఏర్పాటుచేయడంతో మహిళలు గళమెత్తారు. రాస్తారోకో లు, ధర్నాలతో ఉద్యమాలు చేపట్టారు. దీంతో ఎౖMð్సజ్ అధికారులు దిగివచ్చి దుకాణాలను తొలగించక తప్పలేదు. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు దుకా ణాల ఏర్పాటుకు సురక్షిత ప్రాంతాలను అన్వేషించి పెద్ద మొత్తం లీజు చెల్లించి పకడ్బందీగా రేకుల షెడ్లను, దుకాణాలు ఏర్పాటుచేసుకున్నారు.
పాత దుకాణాల్లో ఏర్పాటుకు యత్నాలు
సుప్రీంకోర్టు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాల ఏర్పాటును నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో వర్తించదని తాజాగా స్పష్టం చేయడంతో పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు చెల్లించి దుకాణాలు ఏర్పాటుచేసుకున్న వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మహిళల ఆగ్రహంతో దుకాణాలు ఖాళీ చేసిన వ్యాపారులు ఊ పిరి పీల్చుకుంటుండగా ఇప్పటికే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ప్రజల ఆగ్రహం వ్యక్తంకాని చోట దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు గందరగోళంలో పడ్డారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని ఈ వ్యాపారులు పాత దుకాణాల్లోకి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళల ఆగ్రహాన్ని ఎౖMð్సజ్ శాఖ చవిచూడటమే ఇందుకు కారణం. కాగా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టతపై ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర న్యాయశాఖ అభిప్రాయం కోరుతున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టతపై భీమవరంలో ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజును వివరణ కోరగా విషయం వాస్తవమేనని తమ ఉన్నతాధికారులు న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరుతున్నట్టు చెప్పారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.