హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మరో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు రట్టయింది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అరెస్టయిన వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ప్యాకెట్లు, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్ నేతృత్వంలో దాడులు జరిగాయి.
నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో మత్తుమందు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఆఫ్రికన్ దేశస్తుడు కాగా.. మరో ఇద్దరు స్థానికులని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన ముఠాకు ఈ ముఠాకు సంబంధాలు లేవని సమచారం. ప్రస్తుతం సిట్ బృందం అరెస్ట్ చేసిన ముఠా సభ్యులు ఢిల్లీ, హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విరివిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
డ్రగ్స్ కేసు: మరో ముగ్గురి అరెస్టు
Published Sat, Jul 8 2017 2:09 PM | Last Updated on Wed, Sep 5 2018 8:44 PM
Advertisement
Advertisement