
గుడుంబా విక్రయ కేంద్రాలపై దాడులు
మండలంలోని మామడ, న్యూ సాంగ్వి, చందారం గ్రామాలలో శనివారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.
నిర్మల్(మామడ) : మండలంలోని మామడ, న్యూ సాంగ్వి, చందారం గ్రామాలలో శనివారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. 16 లీటర్‌ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గ్రామాలలో నాటుసారాను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా విక్రయ కేంద్రాలపై దాడి చేసిన వారిలో ఎక్సైజ్ ఎస్‌ఐలు విజయలక్ష్మి, సంధ్యారాణి సిబ్బంది పాల్గొన్నారు.