సినిమావాళ్లను సిట్‌ టార్గెట్‌ చేసింది: డైరెక్టర్‌ | Film stars target of SIT probe, says director PC Aditya | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌: సినిమావాళ్లను సిట్‌ టార్గెట్‌ చేసింది: డైరెక్టర్‌

Published Tue, Aug 1 2017 10:32 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

సినిమావాళ్లను సిట్‌ టార్గెట్‌ చేసింది: డైరెక్టర్‌ - Sakshi

సినిమావాళ్లను సిట్‌ టార్గెట్‌ చేసింది: డైరెక్టర్‌

విశాఖపట్నం: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తీరుపై మరో దర్శకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ రాకెట్‌ కేసు విచారణలో సిట్‌ సినిమా స్టార్లను టార్గెట్‌ చేసిందని ప్రముఖ దర్శకుడు పీసీ ఆదిత్య అన్నారు. విజయనగరంలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

డ్రగ్స్‌ కేసులో మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న కెల్విన్‌ మొబైల్‌ఫోన్‌లో 248 కాంటాక్ట్‌ నంబర్లు లభిస్తే.. కేవలం 12మంది సినీ ప్రముఖులను మాత్రమే సిట్‌ విచారిస్తున్నదని ఆయన తప్పబట్టారు. సిట్‌ సినీ ప్రముఖులను టార్గెట్‌ చేసుకోవడంతో వారి కుటుంబసభ్యులు మానసికక్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. 'డ్రగ్స్‌కు యువత ఎలా బానిసగా మారుతోంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై నా తదుపరి సినిమా ఉంటుంది' అని పీసీ ఆదిత్య తెలిపారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా డ్రగ్స్‌ కేసులో సిట్‌ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement