నేను రోజూ డ్రగ్స్‌ వాడుతా! | I am daily using drugs: Mike khamingo says to police | Sakshi
Sakshi News home page

నేను రోజూ డ్రగ్స్‌ వాడుతా!

Published Sun, Aug 6 2017 6:54 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

డ్రగ్స్‌ నిందితుడు మైక్‌ ఖమింగో - Sakshi

డ్రగ్స్‌ నిందితుడు మైక్‌ ఖమింగో

♦ విచారణలో నెదర్లాండ్‌వాసి మైక్‌ఖమింగో!
 
హైదరాబాద్‌‌: డ్రగ్స్‌ కేసులో నిందితునిగా ఉన్న  నెదర్లాండ్స్‌కు చెందిన  మైక్‌ఖమింగో (30)ను శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయంలో శనివారం విచారించారు.  కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న  పోలీసులు శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు రోజులపాటు ఖమింగోను విచా రించనున్నట్లు సమాచారం. మొదటి రోజు విచారణకు సిట్‌ అధికారులు వస్తారని ఎక్సై జ్‌ పోలీసులు ఎదురుచూశారు. వారు రాకపోవడంతో  సీఐ గాంధీనాయక్‌ విచారించారు. అతను ఎటువంటి సమాధానం చెప్పలేదని తెలిసింది. తమ దేశంలో డ్రగ్స్‌ వాడకం సర్వ సాధారణమని ఇక్కడ చట్టాలు తమకు తెలియదని అధికారులతో అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
తన సెల్‌ఫోన్‌ లాక్‌ కోడ్‌ను మరిచిపోయానని, తనకు ఎవరితో సంబంధాలు లేదని పేర్కొన్నట్లు తెలిసింది.  2.6 గ్రాముల డీఎంటీ  డ్రగ్స్‌ కేసులో  ఖమింగో ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. అతను శేరిలింగంపల్లి పరిధిలోని నానక్‌రాంగూడ జయభేరి ఆరెంజ్‌ కౌంటీలో నివాసముంటున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో  డ్రగ్స్‌ కేసులో నిందితులుగా ఉన్న సినీ ప్రముఖులు అతను ఉండే ప్లాట్‌ పక్కనే నివాసముంటున్నట్లు తెలిసింది. ఖమింగో డ్రగ్స్‌ను సరఫరా చేస్తాడనే అనుమానంతో పోలీసులు  కస్టడీలోకి తీసుకున్నారు. తాను తన దేశంలో డ్రగ్స్‌ రోజూ వాడుతానని, ఇక్కడ కూడా డ్రగ్స్‌ తీసుకుంటానని ఎవరికి సరఫరా చేయనని తెలిపారు. అతని విచారించేటప్పుడు అడ్వకేట్‌ సమక్షంలో పోలీసులు ప్రశ్నించారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement