నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులకు ఎక్సైజ్ అధికారులు జరిమానాలు విధించారు.
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులకు ఎక్సైజ్ అధికారులు జరిమానాలు విధించారు. భైరాపూర్, నెమలి, మీర్జాపూర్ గ్రామాలకు చెందిన బాలరాజు, అశోక్, శ్రీశైలం కల్తీ కల్లు విక్రయిస్తూ మంగళవారం పట్టుబడ్డారు. గతంలో వీరిని ఇదే విషయమై తహశీల్దార్ బైండోవర్ చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఎక్సైజ్ అధికారులు జరిమానా విధించారు.