ముదిగుబ్బ (అనంతపురం జిల్లా) : ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో సోమవారం ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో రమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన తోటపై దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు 17 వేల మద్యం సీసా మూతలు మాత్రమే దొరికాయి. ఎటువంటి మద్యం సీసాలు దొరకలేదు. రమణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిసింది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.