
ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో మద్యం తాగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు, బయట వ్యక్తులు
బాపట్ల: స్థానిక ఎక్సైజ్ పోలీసు స్టేషన్ శుక్రవారం మందు, విందులతో బిజీగా మారింది. ఏకంగా కార్యాలయాన్నే బార్‌గా మార్చేశారు. ఎక్సైజ్ ఎస్‌ఐ రవితో పాటు పలువురు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఇతర వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం కార్యాలయంలోనే మద్యం తాగారు. విందులో కూడా పాల్గొన్న ఎస్‌ఐ చిందులేయడం గమనార్హం. ఈ విషయం తెలిసి మీడియా అక్కడికి వెళ్లగా ఇక్కడ ఇలాంటివి మామూలే అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment