
ఉత్సాహంగా మారథాన్
ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ శిక్షణ పరుగును ఆదివారం నిర్వహించారు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ ధృవ కళాశాల వద్ద ఉదయం ఉదయం 5గంటలకు చేపట్టారు.
ఎయిర్‌టెల్ హైదరాబాద్ ఉత్సాహంగా మారథాన్
మేడ్చల్ రూరల్: ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ శిక్షణ పరుగును ఆదివారం నిర్వహించారు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ ధృవ కళాశాల వద్ద ఉదయం ఉదయం 5గంటలకు చేపట్టారు. కళాశాల నుంచి రింగురోడ్డు సర్వీస్‌రోడ్డులో నిర్వాహకులు రన్నింగ్ ప్రారంభించారు. 250 మంది ఔత్సాహకులు 10, 21, 32 కే రన్‌ల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ ఆరో ఎడిషన్ శిక్షణలో భాగంగా ఈ రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు రన్నింగ్ చేయాలని సూచించారు. పరుగుతో ఎన్నో లాభాలు ఉంటాయని, మనిషి ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. శిక్షణలో భాగంగా ఈ నెల 27, 28వ తేదీల్లో హైదరాబాద్‌లో రన్నింగ్ చేపడుతున్నట్లు వివరించారు.