కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గీతా వృత్తికి సాక్షి దినపత్రిక వెన్నుదన్నుగా నిలిచింది. ఈతవనాల పెంపకానికి పిలుపునివ్వడంతో జిల్లా నలుమూలల నుండి గౌడజనులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. నిర్వీర్యమవుతున్న గీతా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సాక్షి చేసిన చిన్న ప్రయత్నానికి ప్రశంసల వెల్లువ లభించింది. కనుమరుగ వుతున్న గీత వృత్తిని బతికించేందుకు సాక్షి ఆధ్వర్యంలో ఈత వనాల పెంపుకోసం మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటుచేసింది.