special meeting
-
బాబు, పవన్ డబుల్‌గేమ్‌పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్‌గేమ్‌పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్‌కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్‌కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్‌ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్‌నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్‌నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గురువారం ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అటుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎస్‌తో పాటు రాజ్‌భవన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే భేటీ సారాంశం అధికారకంగా బయటకు రాకపోయినా.. గవర్నర్‌తో ప్రత్యేక భేటీలో.. పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న బిల్లులపైనా సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల భేటీ తర్వాత.. పట్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆపై సీఎం కేసీఆర్, కేబినెట్‌తో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య నెలకొన్న గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం, ఆ చర్యపై ఆమె బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతుండడం చూస్తున్నాం. అదే సమయంలో ఆమె ముఖ్యమైన బిల్లులనూ పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు. -
3న ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ ఎంపీసీ భేటీ
ముంబై: గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన ద్రవ్యోల్బణం సవాళ్లపై ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక రూపకల్పనపైనే నవంబర్ 3న జరిగిన ఆర్బీఐ ఎంపీసీ చర్చించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. సెక్షన్ 45జెడ్ ఎన్ కింద... సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరగనుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. తన చర్యల గురించి ఆర్బీఐ కేంద్రానికి వివరణ ఇవ్వడం 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. ఆర్బీఐ తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనున్న నేపథ్యంలో వచ్చేనెల 3న జరిగే ‘ద్రవ్యోల్బణంపై’ కీలక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేడు బీసీసీఐ ప్రత్యేక వార్షిక సమావేశం
-
నల్లగొండ ఉప ఎన్నిక ఖాయం?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండకు ఉప ఎన్నిక ఖాయమన్న నిశ్చితాభిప్రాయానికి అధికార టీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది. ఈ మేరకు జిల్లా నేతలతో పార్టీ అధినాయకత్వం మంతనాలు జరుపుతోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. నల్లగొండపై పట్టు సాధించేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తోంది. బుధవారం రాత్రి కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరగడం వల్ల జిల్లా నాయకులతో కూలంకశంగా చర్చించలేక పోయారని, గురువారం సీఎం కేసీఆర్ మరో మారు పార్టీ ముఖ్య నాయకులు కొందరిని పిలిపించుకుని ఎన్నికల వ్యూహంపై చర్చించారని తెలిసింది. నల్లగొండ ఇన్చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డిలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన మైక్ హెడ్సెట్ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలి కంటికి గాయమైందని తేల్చారు. స్పీకర్ నిర్ణయం మేరకు కోమటిరెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయినట్లు గుర్తిస్తూ శాసన సభా సచివాలయం భారత ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ఎన్నికలు జరిగే ఖాళీ స్థానాలతో కలిపి నల్లగొండ ఉపఎన్నిక కూడా వస్తుందన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైతే, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లా నాయకులు దిశానిర్దేశం చేశారని సమాచారం. కలిసి పనిచేయాలి పార్టీ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు నల్లగొండ నియోజకవర్గంలో అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. టీడీపీ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరగానే ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో అప్పటిదాకా ఇన్చార్జిగా వ్యవహరించిన దుబ్బాక నర్సింహా రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముందునుంచీ ఎడమొహం, పెడమొహంలా ఉంటున్న ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, కంచర్ల వర్గాలు కలిసి పనిచేస్తాయా అన్న అనుమానాలూ రేకెత్తాయి. దీంతో అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిందేనని, అందరినీ కలిసి, కలుపుకొని పోవాల్సిన బాధ్యత భూపాల్‌రెడ్డిదేదని కేసీఆర్ చెప్పారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా, రాకున్నా, 2019 సార్వత్రిక ఎన్నికల కోసమైనా ఇప్పటినుంచే పనిచేసుకుంటూ పోవాలని కూడా సూచించారని సమాచారం. మరో వైపు జిల్లా నాయకులను, ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రూపులను సమన్వయం చేసి, అంతా కలిసికట్టుగా పనిచేయించే బాధ్యతను, ఉప ఎన్నికకు ఇన్చార్జ్గా మంత్రి కేటీఆర్‌ను నియమించారని తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారాలు ముగిసి ఉప ఎన్నిక ప్రకటన వెలువడేలోగా పార్టీని బలోపేతం చేసుకోవడం, తమలో ఉన్న అభిప్రాయ బేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేసేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో టీఆర్ఎస్ ఉంది. స్థానిక నాయకులంతా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పనిచేయాలని కూడా సూచించా రని అంటున్నారు. మొత్తంగా ఉప ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి పూర్తి సంసిద్ధంగా ఉండేలా కేడర్‌ను తయారు చేయడంపై నాయకత్వం దృష్టి పెట్టింది. -
వెనిజులా పార్లమెంట్లో హింస
కారకస్: వెనిజులాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశం హింసాత్మకంగా మారింది. గురువారం ప్రభుత్వ మద్దతుదారులు దుడ్డు కర్రలు, పైపులతో నేషనల్ అసెంబ్లీలోకి చొరబడి ప్రతిపక్ష సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఆ తరువాత అధ్యక్షుడు మదురో మద్దతుదారులు పార్లమెంట్‌ను 9 గంటలపాటు ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తొలుత జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన పోలీసులు తర్వాత∙సైన్యంసాయంతో ఎంపీలను విడిపిం చారు. ఉదయం సుమారు 100 మంది దుడ్డు కర్రలు, పైపులతో తొలుత పార్లమెంట్ ముందు గేటు, ఆ తరువాత ఇంటీరియర్ గార్డెన్, భవనం గేట్లను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కారిడార్లోకి చొచ్చుకెళ్లి చట్ట సభ్యులపై దాడి చేశారు. స్టన్ గ్రెనేడ్లను పేల్చారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని పాత్రికేయులను బెదిరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చేరారని ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. ప్రభుత్వ మద్దతుదారులు..ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉగ్రవాదులు, హంతకులు అని అరుస్తూ పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. పోలీసులు ఎట్టకేలకు ప్రతిపక్ష సభ్యులను బయటికి తీసుకురాగలిగారు. -
హైవేలో ప్రమాదాల నివారణకు కృషి
► అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి.శ్రీనివాస్ మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) : జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు. ప్రమాదాలకు గల కారణాలు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వెల్లడించారు. శనివారం మాధవధారలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా మూడు జిల్లాల పరిధిలో గల హైవేలలో పరిశోధన జరుపుతున్నారు. విశాఖపట్నం డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నేతృత్వంలో పరిశోధన జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో 114, విజయనగరంలో 33, శ్రీకాకుళం జిల్లాలో 180 కిలో మీటర్ల హైవే కలిగి ఉంది. మూడు జిల్లాల పరిధిలో ప్రమాదకర ప్రాంతాలు, అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న అంశాలు, రోడ్ల డిజైనింగ్, కల్వర్టుల నిర్మాణం, స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్ లైట్లు, తదితర అంశాలపై పరిశోధన జరుపుతున్నారు. హైవే నిబంధనల ప్రకారం రోడ్ల నిర్మాణం ఎలా ఉందో పరిశీలించారు. బుధవారం నాటికి సర్వే పూర్తిచేసి డీటీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు శ్రీనివాస్ స్పష్టం చేశారు. నివేదికలో ఆయా అంశాలు, సూచనలకు తగ్గట్టుగా ప్రభుత్వం చొరవ చూపనుందని ప్రకటించారు. ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ పరంగా హైవేలలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు, విశాఖ ఆర్టీవోలు ఎ.హెచ్.ఖాన్, ఐ.శివప్రసాద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రవాణా అధికారులు, గీతం కళాశాల ప్రొఫెసర్ ముకుంద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రొఫెసర్లు రమేషన్‌రాజు, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ దాడులకు ఐదు రాష్ట్రాల అధికారులు
చెన్నైలో ముగిసిన రెండురోజుల రహస్య సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: తీగలాగితే డొంక కదిలినట్లుగా తమిళనాడు మాజీ సీఎస్ రామమోహన్‌రావు, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి, ఇళ్లపై ఐటీ దాడులతో మరికొంత మంది బడా బాబుల పేర్లు బైటకు రాబోతున్నాయి. శేఖర్‌రెడ్డి, రామ మోహన్‌రావుల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో పేర్లు న్న పెద్దల ఇళ్లపై దాడులకు ముహూర్తం పెడుతున్నారు. తమిళనాడులో రెండో విడత దాడులకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25, 26వ తేదీల్లో చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయంలో అధికారులు రహస్యంగా సమావేశమ య్యారు. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 140 మంది ఐటీ ఉన్న తాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిసింది. నగదు, నగలు, డాక్యుమెంట్లే కాకుండా కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోవడానికి ప్రాముఖ్యతనివ్వా లని తీర్మానించారు. బెంగళూరులో వివేక్‌కు కోట్ల స్థిరాస్తులు తమిళనాడు మాజీ సీఎస్ రామమోహన్‌రావు కుమారుడు వివేక్ పాపిశెట్టికి గతవారంలో నోటీసులిచ్చిన ఐటీ శాఖ.. తాజాగా మరోసారి రిమైండర్ నోటీసులు పంపింది. తన భార్య అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేక పోతున్నానని గతంలో వివేక్ విచారణ అధికారులకు తెలి పాడు. వివేక్ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడి నట్లు ఐటీ శాఖ భావిస్తోంది. బెంగళూరులో కోట్లాది రూపాయల ఖరీదు చేసే 500 లగ్జరీ అపార్టుమెంట్లను వివేక్ కొనుగోలు చేసినట్లు దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ద్వారా ఐటీ అధికారులు కనుగొన్నారు. సహకార బ్యాంకులకు ఐటీ నోటీసులు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత కరెన్సీని మార్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి కొన్ని కోట్ల రూపాయల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో జిల్లా సహకార బ్యాంకులకు ఐటీశాఖ సోమవారం నోటీసులు జారీచేసింది. -
ఎంఏడీఏలో కదలిక
మచిలీపట్నం : మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (ఎంఏడీఏ) ద్వారా భూసమీకరణలో కదలిక వచ్చింది. కలెక్టర్ బాబు.ఎ సోమవారం డీఆర్వో చెరుకూరి రంగయ్య, ఆర్డీవో పి సాయిబాబు, డెప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో తన చాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ కోసం ఎంఏడీఏ పరిధిలోని 28 రెవెన్యూ గ్రామాలలో దాదాపు 24,500 ఎకరాల భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే 11,500 ఎకరాల భూమి రికార్డుల పరిశీలన జరిగిందని, మరో 13వేల ఎకరాల భూమి వివరాలను పరిశీలించాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు ఎంఏడీఏ కు కార్యాలయం లేని నేపథ్యంలో డీఆర్డీఏ కార్యాలయం పై అంతస్తులో ఈ కార్యాలయాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎంఏడీఏలో నియమించిన డెప్యూటీ కలెక్టర్లను త్వరితగతిన విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరితోపాటు ఒక్కొక్క యూని ట్లో రెండు రెవెన్యూ గ్రామాలు ఉంటాయని డెప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, డెప్యూటీ తహసీల్దార్లు ఇరువురు, డెప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్, ఆర్ఐ, సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరిని త్వరితగతిన నియమించాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా మచిలీపట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్లలోని అధికారులు, సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. అప్పటికీ సిబ్బంది కొరత ఉంటే కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల నుంచి ఉద్యోగులను ఎంఏడీఏలోకి తీసుకోవాలని సూచించారు. ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, 13వేల ఎకరాల భూమి రికార్డులను పరిశీలించిన అనంతరం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయటం జరుగుతుందని కలెక్టర్ చెప్పా రు. ఎంఏడీఏకు భూసమీకరణ నిమిత్తం కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలుసుకున్న రైతుల్లో అలజడి ప్రారంభమైంది. 24,500 ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటంతో తమ భూములు కోల్పోతామనే భయం రైతులను వెంటాడుతోంది. 2015 ఆగస్టు 29న దాదాపు 30వేల ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ భూసేకరణ నోటిఫికేషన్ గడువు గత ఆగస్టు 29వ తేదీతో ముగియనుండటంతో 12 నెలల పాటు భూసేకరణ నోటిఫికేషన్ గడువును పెంచుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూసమీకరణ నోటిఫికేషన్, భూసేకరణ నోటిఫికేషన్ రెండూ అమలులో ఉన్న నేపథ్యంలో కలెక్టర్ భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించటం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ సమావేశంలో మచిలీపట్నం తహసీల్దార్ బి నారదముని, డెప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. -
మోకుకు వెన్నుదన్నుగా నిలిచిన సాక్షి
-
చిన్నబోయిన మోకుకు వెన్నుదన్నుగా నిలిచిన సాక్షి
ఈతవనాల పెంపకానికి భారీగా తరలివచ్చిన గౌడన్నలు గౌడ సమస్యలకు వేదికైన చిట్టాపూర్ సాక్షి చొరవను అభినందించిన మంత్రి హరీష్‌రావు గీతవృత్తిపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని హామీ ఆనందం వ్యక్తంచేసిన కల్లుగీతాకార్మికులు మెదక్: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గీతా వృత్తికి సాక్షి దినపత్రిక వెన్నుదన్నుగా నిలిచింది. ఈతవనాల పెంపకానికి పిలుపునివ్వడంతో జిల్లా నలుమూలల నుండి గౌడజనులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. నిర్వీర్యమవుతున్న గీతా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సాక్షి చేసిన చిన్న ప్రయత్నానికి ప్రశంసల వెల్లువ లభించింది. కనుమరుగ వుతున్న గీత వృత్తిని బతికించేందుకు సాక్షి ఆధ్వర్యంలో ఈత వనాల పెంపుకోసం మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి 10వేల చిలుకు గౌడజనులు వాహనాల్లో తరలివచ్చి వేలాది ఈతమొక్కలు నాటారు. జనంతో చిట్టాపూర్ గ్రామం కిక్కిరిసింది. రాజుల కాలం నుండి సురాపానకానికి(కల్లు)కు ఎంతో ప్రత్యేకత ఉండేది. కాగా కల్తీకల్లు విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఎంతో మంది గౌడన్నలను జైళ్లోపెట్టారు. వారిదాడులను భరించలేని ఎంతోమంది గీతాకార్మికులు కల్లు విక్రయించడం తమతోకాదంటూ దుకాణాలను లీజుకివ్వడం మొదలు పెట్టి వృత్తికి దూరమయ్యారు. మరికొందరు గత్యంతరంలేక వారి వద్దనే జీతం ఉంటూ దుర్బర జీవితాలు గడుపుతున్నారు. దీనికంతటికి ఒకే కారణం ఈత వనాలు లేకపోవడమేనన్న విషయాన్ని క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాక్షి దినపత్రిక ప్రతి గ్రామంలో విరివిగా ఈతవనాలు ఉంటే కల్తీకల్లును ఎందుకు తయారుచేస్తారు. అనే ఆలోచనతో మెదక్ జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఈతవనాల పెంపునకు శ్రీకారం చుట్టి అక్కడే బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి పదివేలకుపైగా గౌడ జనులు తరలివచ్చి తమ సమస్యలను రాష్ట్రమంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్‌రావు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గౌడజనుల సమస్యలను పరిష్కరిస్తామని హామినిచ్చారు. దీంతో గౌడకులస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్గౌడ్లతోపాటు అనేకమంది ప్రముఖులు తరలివచ్చి సాక్షిని అభినందించారు. -
శ్రీ కనకదుర్గ లో టీడీపీ పాలిట్రిక్స్
లోగుట్టు సీఎం పేషీకి ఎరుక విమర్శించినవారే ఒక్కటయ్యారు భారీగా మామూళ్ల మంత్రాంగం టీడీపీ తీరుపై విపక్షాల మండిపాటు విజయవాడ సెంట్రల్ : అబద్ధాన్ని గట్టిగా చెబితే తిమ్మిని బమ్మిని చేయొచ్చని భావిస్తున్నట్లున్నారు టీడీపీ పాలకులు. శ్రీ కనకదుర్గ లేఅవుట్‌కు సంబంధించి అక్రమాల లోగుట్టులోనూ అదే ట్రిక్ ప్లే చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేవాళ్లు కూడా ఒక్కటయ్యారు. ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్లు కలిసిపోయారు. సీఎం పేషీ ‘అభీష్ట’ం నెరవేరింది. లే అవుట్ నిబంధనలు మాయమైపోయాయి. శ్రీ కనకదుర్గ బిల్డింగ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ ఆమోదానికి రాజముద్ర పడింది. ఈ కథకు సీఎం పేషీ నుంచే స్క్రీన్‌ప్లే జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎన్జీవో నాయకుడిని సంతృప్తిపరిచేందుకే ఇంత తతంగం నడిపిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ అసమ్మతి జ్వాలలు ఏమయ్యాయ్? ఈ ఏడాది మే నెల ఏడో తేదీన కౌన్సిల్ లేఅవుట్‌ను ఆమోదించింది. ఇది టీడీపీలో బ్లో అవుట్‌గా మారింది. స్పెషల్ మీటింగ్ వేసి దీనిని రద్దు చేస్తామంటూ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మీడియాకు చెప్పారు. ఉవ్వెత్తున ఎగిసిన అసమ్మతి జ్వాలలు అంతలోనే చప్పున చల్లారిపోయాయి. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అంతా ఏకమైపోయారు. దీని వెనుక భారీగా మామూళ్ల మంత్రాంగం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం పేషీ సూచన మేరకే ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతా ఒక్కటైపోయారు... సెంట్రల్, తూర్పు ఎమ్మెల్యేలతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు సత్సంబంధాలు లేవు. మొదటి నుంచి మేయర్‌ను వ్యతిరేకించే ధోరణిలోనే వారిద్దరూ వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, మేయర్ మధ్య కూడా సరైన అవగాహన లేదని ఆ పార్టీ కార్పొరేటర్లే చెబుతుంటారు. శ్రీ కనకదుర్గ విషయంలో మాత్రం వీరంతా ఒక్కటైపోయారు. మున్నెన్నడూ లేని విధంగా గోగుల రమణ మేయర్ శ్రీధర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీర్మానంపై చర్చ ముగిసేవరకు ఉండి వెళ్లారు. పార్టీ అధిష్టానం తమ నోళ్లు కట్టేసిందని ఆ పార్టీ కార్పొరేటర్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా కనకదుర్గ డీల్ కుదుర్చుకున్నారని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కొందరి లబ్ధి వల్ల పార్టీ అల్లరి అయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు బహిరంగ విమర్శలు గుప్పిస్తుంటే స్వపక్షం అంతర్గత విమర్శలకు పదును పెడుతోంది. కనకదుర్గ లేఅవుట్పై న్యాయ పోరాటం : పుణ్యశీల టీడీపీలో ‘శ్రీ కనకదుర్గ’ లే అవుట్ అడ్డగోలు ఆమోదంపై న్యాయపోరాటం చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బి.ఎన్.పుణ్యశీల స్పష్టం చేశారు. పార్టీ కార్పొరేటర్లతో కలసి గురువారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డెరైక్టర్ అండ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. భారీగా ముడుపులు ముట్టడం వల్లే మేయర్ కోనేరు శ్రీధర్ లే అవుట్‌కు పచ్చజెండా ఊపారన్నారు. అధికారాన్ని అతిక్రమించి కౌన్సిల్ ఆదాయానికి గండికొట్టే ప్రతిపాదనలు, నిర్ణయాలు తీసుకొనేవారు సెక్షన్ 679 సబ్ సెక్షన్స్ ఏ,బీ,సీ,డీ ప్రకారం పదవి లేదా అధికారం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కోర్టులో కేసు వేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ తాము తప్పు చేయలేదన్నారు. ప్రతిపక్షం సభలో ఉంటే తమ పప్పులుడకవనే భయంతోనే రోజంతా తమను సస్పెండ్ చేశారన్నారు. మెజార్టీ ఉంది కాబట్టి కౌన్సిల్లో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో మేయర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కౌన్సిల్లో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారన్నారు. డ్రెయినేజ్, వాటర్ చార్జీలను తగ్గిస్తామని చెప్పిన పాలకులు అధికారుల్ని అడ్డం పెట్టుకొని మరో ఏడు శాతం పెంచారన్నారు. త్వరలోనే ఆస్తిపన్నును 30 శాతం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, జె.పూర్ణమ్మ, బి.సంధ్యారాణి పాల్గొన్నారు. -
కట్నం కేసుల్లో ఎస్ఓపీ పాటించండి
మహిళా ఠాణాల అధికారులతో కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లోని అన్ని మహిళా పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్లు ఒకే పద్ధతిని అవలంభించాలని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కట్న వేధింపుల కేసుల్లో అధికారులు, సిబ్బంది బాధితులు, నిందితులతో ఎలా నడవాలనే విషయంపై ‘స్టాండర్డ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)లోని నిబంధనలు, సూచనలను పాటించాలని కమిషనర్ ఆదేశించా రు. మహిళా ఠాణాల ఇన్స్పెక్టర్లు, అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, సీసీఎస్ డీసీపీ పాలరాజుతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. మహిళల కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, చట్టాన్ని ఉల్లంఘించి తమ ఇష్టం వచ్చినట్లు నడవడం వల్ల ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పోతుందని ఆయన హెచ్చరించారు. అయితే, కట్న వేధింపులు, గృహహింస తదితర కేసుల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఎస్ఓపీలో సూచించిన పద్ధతులు, విధివిధానాల ప్రకారం నడుచుకోవాలన్నారు. మహిళా కేసుల్లో అనవసరంగా ఎవరిని వేధించవద్దని, బాధితులు ఒత్తిడి తెచ్చినంత మాత్రాన అతిగా వ్యవహరించవద్దని అధికారులకు సూచించారు. సమావేశంలో మహిళా ఠాణాల ఇన్స్పెక్టర్లు బి.ధనలక్ష్మి, జి.రజిత, వి.శ్రీనివాస్‌రెడ్డి, టి.జ్యోత్స్న పాల్గొన్నారు. వరకట్నం కేసుల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇన్స్పెక్టర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరంలోని మహిళా ఠాణాలివే.. నార్త్‌జోన్ పరిధిలోని బాధితులందరూబేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాలి. అక్కడ ఇన్స్పెక్టర్ బి.ధనలక్ష్మి ఉంటారు. అలాగే సౌత్‌జోన్ (పాతబస్తీ) వారు హైకోర్టు ఎదురుగా ఉన్న ఘాన్సీబజార్‌లోని సౌత్‌జోన్ మహిళా ఠాణాలో ఇన్స్పెక్టర్ జి.రజితను, ఈస్ట్, సెంట్రల్, వెస్ట్‌జోన్‌లకు సంబంధించి నాంపల్లిలోని సీసీఎస్ భవనంలో ఉన్న మహిళా పోలీసు స్టేషన్ (సీసీఎస్)ను ఆశ్రయించాలి. ఈస్ట్, సెంట్రల్ జోన్లకు సంబంధించి ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, వెస్ట్‌జోన్‌కు సంబంధించి ఇన్స్పెక్టర్ టి.జోత్స్న కేసులను దర్యాప్తు చేస్తున్నారు. సీసీఎస్, బేగంపేట ఠాణాలలో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు, కౌన్సెలర్లు ఉన్నారు. సౌత్‌జోన్ మహిళా ఠాణాలో త్వరలోనే కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎస్ఓపీ ముఖ్య ఉద్దేశాలు...... వరకట్నం కేసుల్లో అధికారులు ఎలా వ్యవహరించాలి, ప్రామాణిక కార్యాచరణ విధానం వంటివి అంశాలతో ఎస్ఓపీ రూపొందించారు. పోలీసు అధికారుల వ్యక్తిగత నిర్ణయాలు తగ్గించడం. తద్వారా కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నివారించడం. ఏ కేసు వచ్చినా చట్టపరిధిలోనే పని చేయడం. ఎస్‌ఓపీలోని సూచనలు... సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన సూచనలను పాటించాలి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయకూడదు బాధితులు, నిందితుల (భార్య, భర్త)ను స్టేషన్‌కు పిలిపించాలి ఇరువురి వివరణ శ్రద్ధగా వినాలి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇప్పించాలి ఇలా మూడు సార్లు కౌన్సెలింగ్స్ ఇప్పించాలి పరిస్థితి మారకుంటే కౌన్సెలర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితులను అరెస్టు చేయకూడదు కేసు నమోదైనట్లు ముందుగా నోటీసులు జారీ చేయాలి వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే వారం రోజులు గడువు ఇచ్చి మరో నోటీసు జారీ చేయాలి ఇలా మూడు నోటీసులు జారీ చేసినా వారు స్టేషన్‌కు రాకుంటే అరెస్టు చేయాలి అరెస్టు సమయంలో వారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించాలి బాధితులు ఒత్తిడి చేస్తున్నారని, వారిని సంతృప్తి పర్చడానికి చట్టాన్ని అతిక్రమించకూడదు. మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నిష్పక్షపాతంగా విచారణ చేపడతాం. అందుకు కావాల్సిన ఎస్ఓపీ విధానాన్ని తయారు చేశాం. వరకట్న కేసుల్లో దంపతులిద్దరి వాదనలు వింటాం. తమ సూచనలతో ఇద్దరూ సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టు తాజాగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. - మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
తారుమారు!
నేతల ఇళ్లకు వెళుతున్న బొత్స తొలుత చిన్న శ్రీను ఇంట్లో నేతలతో సమావేశం ఆ తర్వాత కోలగట్ల ఇంట్లో ప్రత్యేక భేటీ పార్టీ పరిస్థితిపై సుదీర్ఘ చర్చ ఆయన ఇప్పటివరకూ జిల్లాలో మకుటం లేని మారాజు...ఆయన చెప్పిందే వేదంగా భావించే అనుచరులు ఎంతటి కార్యానికైనా సాహసించేవారు. ఎవరైనా ఆయన వద్దకు వెళ్లాల్సిందే... అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు ఆయనే అందరినీ కలిసే పనిలోపడ్డారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ పదవి పోయిన తర్వాత తొలిసారిగా జిల్లాకొచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. పార్టీని ఎలా నిలబెట్టాలన్న దానిపై దృష్టిసారించారు. సాధ్యాసాధ్యాలపై అనుచరులతో చర్చిస్తున్నారు. ఏం చేస్తే గాడిలో పడుతుందన్న దానిపై నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో తానే నాయకుల ఇళ్లకెళ్లి సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో గట్టెక్కె విషయమై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. తొలుత తన మేనల్లుడు చిన్న శ్రీను ఇంట్లో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎవరెక్కడ పోటీ చేయాలి? పరిస్థితులు ఎక్క డ అనుకూలంగా ఉన్నాయి, పార్టీ నుంచి వలసపోతున్నదెవరు? మిగిలేవారెంతమంది? తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన ట్టు తెలిసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికెళ్లారు. కొన్ని గంటల పాటు పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న వారి విషయమై సంప్రదింపులు చేశారు. లోపాయికారీ దెబ్బలు మొదలయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక నేతలిద్దరూ సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి ఇంతకాలం తన ఇంటికొచ్చిన నేతలతో పార్టీ రాజకీయాలపై చర్చించే బొత్స ఇప్పుడేకంగా నాయకుల ఇళ్లకెళ్లి సమావేశమవ్వడంతో పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపోతున్నాయి.