నల్లగొండ : మద్యం అమ్మకాల్లో జిల్లా ఎకై ్సజ్ శాఖ సరికొత్త రికార్డు సష్టించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి గతంలో సాధించిన రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది. కారణాలు ఏమైనప్పటికీ కళ్లు బైర్లుకమ్మేంత రీతిలో జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంలో రూ.15 వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
‘ఫుల్’ కిక్..!
Published Fri, Oct 7 2016 11:00 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
తెగతాగేశారు
మద్యం అమ్మకాల్లో జిల్లా సరికొత్త రికార్డు
ఏడాదిలో...రూ.1500 కోట్ల మద్యం విక్రయాలు
2014–15తో పోలిస్తే రూ.486 కోట్లు అధికం
ఆదాయంలో 47.92 శాతం వృద్ధి రేటు
అమ్మకాల్లో మీడియం, ప్రీమియం బ్రాండ్లదే పైచేయి
బీర్లు 40 లక్షల 24 వేలు, లిక్కర్ 28 లక్షల 96 వేల పెట్టెల అమ్మకం
గ్రామీణ ప్రాంతాల్లో ఏరులై పారిన మద్యం
నల్లగొండ : మద్యం అమ్మకాల్లో జిల్లా ఎకై ్సజ్ శాఖ సరికొత్త రికార్డు సష్టించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి గతంలో సాధించిన రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది. కారణాలు ఏమైనప్పటికీ కళ్లు బైర్లుకమ్మేంత రీతిలో జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంలో రూ.15 వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది వరకు రూ. వెయ్యి కోట్ల వరకే పరిమితమైన మద్యం సేల్స్ ఏడాది వ్యవధిలో ఒక్కసారిగా అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలకు పెరగడం విశేషం. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గతంతో పోలిస్తే వద్ధి రేటు 47.92 శాతంగా నమోదైంది. రికార్డు స్థాయిలో మద్యం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం సారా విక్రయాల పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమేనని ఎకై ్సజ్ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు మద్యం ధరలు 5 నుంచి 15 శాతానికి పెంచడం కూడా ఒక కారణమని అంటున్నారు.
ఏరులైన మద్యం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి చే రిన ఆదాయం అక్షరాల రూ.15 వందల కోట్లు. కొత్త పాలసీ అమల్లోకి రాకముందు అంటే 2014 అక్టోబర్ 1 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకు జరిగిన మద్యం అమ్మకాలు రూ.1014 కోట్లు. ఈ లెక్కల ప్రకారం ఏడాది కాలంలో రూ.480 కోట్ల మద్యం అమ్మకాలు పెరగాయన్నమాట. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు బీర్లు 40,24,417 పెట్టెలు అమ్ముడుకాగా...లిక్కర్ 28,96,319 పెట్టెలను విక్రయించారు. అదే అంతకు ముందు ఏడాది అయితే బీర్లు 33,15,506 పెట్టెలు అమ్ముడుకాగా...లిక్కర్ 16,98,851 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. మద్యం అమ్మకాల్లో బీర్లు తర్వాత మీడియం, ప్రీమియం బ్రాండ్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది కాలంలో బీర్లు 40,24, 417 పెట్టెలు అమ్ముడైతే...మీడియం 15,45,652, ప్రీమియం 9,83, 612 పెట్టెలు అమ్ముడు కావడం విశేషం. గతంతో పోలిస్తే బీర్లు అమ్మకాల్లో వద్ధి రేటు 21. 38 శాతం పెరిగింది. అదే లిక్కర్ విషయానికొస్తే మీడియం 38.06 శాతం, ప్రీమియం 78. 46 శాతం పెరిగాయి.
చీప్ లిక్కర్ ప్రత్యేకం...
మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్‌కు (ఆర్డినరీ) ప్రత్యేక స్థానం ఉంది. సాధ్యమైనంత వరకు సారా విక్రయాలు బంద్ కావడంతో దాని స్థానంలో చీప్ లిక్కర్‌కు విపరీతమైన గి రాకీ పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో మీడియం, ప్రీమియం బ్రాండ్లు అధికంగా సేల్ కాగా గ్రామీణ ప్రాంతాల్లో ‘చీప్’కు డిమాండ్ పెరిగింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి రాక ముందు వరకు సారా అమ్మకాలు జోరుగానే సాగాయి. 2014 అక్టోబర్ 1 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకు చీప్ లిక్కర్ జిల్లాలో కేవలం 28,121 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. సారా బంద్ చేసి కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలో చీప్ లిక్కర్ ఏకంగా 3,67,055 పెట్టెలు అమ్ముడవడం గమనార్హం. వద్ధి రేటు 1205.27 శాతానికి పెరిగింది.
======
స్టేషన్‌ల వారీగా అమ్మకాలు ఇలా....
జిల్లాలో 2014 అక్టోబర్ 1 నుంచి 2016 సెప్టెంబర్ 30 వరకు జరిగిన లిక్కర్, బీర్ల అమ్మకాలు (స్టేషన్‌ల వారీగా)
2014–15 2015–2016
స్టేషన్లు లిక్కర్ బీర్లు లిక్కర్ బీర్లు (పెట్టెలు)
నల్లగొండ 2,66,609 5,69,240 3,93,167 6,49,120
సూర్యాపేట 1,54,352 3,37,750 3,09,761 4,14,107
తుంగతుర్తి 64,641 1,46,920 1,35,879 1,91,753
నకిరేకల్ 75,146 1,96,600 1,37,368 2,52,096
చండూరు 57,256 1,12,761 88,862 1,52,471
భువనగిరి 2,09,116 3,49,456 2,78,880 4,25,991
రామన్నపేట 1,20,483 2,19,654 1,66,277 2,90,772
ఆలేరు 81,548 1,42,738 1,33,489 1,93,769
మోత్కూరు 51,743 96,626 80,717 1,25,918
మిర్యాలగూడ 1,60,696 3,45,540 2,78,007 3,61,459
హుజూర్‌నగర్ 1,12,935 1,94,726 2,00,360 2,18,373
కోదాడ 1,18,024 1,52,816 2,30,533 1,78,172
హాలియా 82,041 1,71,524 1,78,199 2,11,271
దేవరకొండ 1,10,460 2,13,247 2,15,292 2,54,250
నాంపల్లి 33,801 65,908 69,528 1,04,895
Advertisement
Advertisement