10కిలోల గంజాయి స్వాధీనం
10కిలోల గంజాయి స్వాధీనం
Published Fri, Jan 27 2017 9:52 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ నుంచి ఎకై్సజ్ పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక పద్మావతి హైస్కూల్ సమీపంలో నివసిస్తున్న సారా విక్రేతరాలు ఇస్తేరమ్మ ఇంటిపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. దాడుల్లో నాలుగు బిందెల సారాతో పాటు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ జానకిరామ్ మాట్లాడుతూ నిందితురాలి ఇంటిలో తనిఖీ చేస్తుండగా సిబ్బందిపై దాడికి యత్నించిందన్నారు. నిందితురాలిని విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో స్థానిక ఎస్‌ఐ లోకేష్ కుమార్, ఎక్సైజ్ ఎస్‌ఐ సుబ్బయ్య, ఆర్‌ఐ జాకీర్ హుసేన్, వీఆర్వో గౌస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement