ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ దాడులు | excise officers rides on dhoolpet area | Sakshi
Sakshi News home page

ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ దాడులు

Published Sun, Dec 6 2015 7:26 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

హైదరాబాద్ ధూల్‌పేట్లో ఆదివారం ఎక్సైజ్ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు.

అబిడ్స్: హైదరాబాద్ ధూల్‌పేట్లో ఆదివారం ఎక్సైజ్ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి తయారీ సామాగ్రితో పాటు గంజాయి తయారు చేస్తున్న పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.

 

400 లీటర్ల ఐడీ లిక్కర్, 18,600 లీటర్ల వాష్, 195 కిలోల నల్లబెల్లం, 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, గుడుంబా తయారీకు ఏలాంటి సంబంధంలేని మహిళలను కూడా అక్రమంగా అరెస్టు చేశారంటూ స్థానికులు ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్‌ఎస్ నేత నందకిషోర్‌వ్యాస్ అధికారులతో మాట్లాడి 9 మంది మహిళలను విడిపించడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement